Manchineel Tree: ప్రపంచంలో విషపూరితమైన మొక్క.. ఈ చెట్టుమీద నుంచి పడిన నీటి చుక్కకూడా ప్రాణాలను తీస్తుందట

|

Oct 03, 2021 | 8:03 AM

Manchineel Tree: మొక్కలు మానవుడికి ప్రాణాధారం.  మనిషికి మొక్కలతో ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రాణం ఉన్న జీవుల్లో మాంసాహారులు, శాఖాహారులున్నట్లే .. మొక్కల్లో..

Manchineel Tree: ప్రపంచంలో విషపూరితమైన మొక్క.. ఈ చెట్టుమీద నుంచి పడిన నీటి చుక్కకూడా ప్రాణాలను తీస్తుందట
Manchineel Tree
Follow us on

Manchineel Tree: మొక్కలు మానవుడికి ప్రాణాధారం.  మనిషికి మొక్కలతో ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రాణం ఉన్న జీవుల్లో మాంసాహారులు, శాఖాహారులున్నట్లే .. మొక్కల్లో కూడా మాంసాహారులు. శాఖాహారులు ఉన్నాయి.  అయితే కొని మొక్కలు మనిషి మనుగడకు కారణమైతే…మరికొన్ని మొక్కలు జీవుల ప్రాణాలను సైతం తీస్తాయట. మొక్కల్లో అత్యంత ప్రమాదకరమైన విష పూరిత మొక్కలు ఉన్నాయి.  ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టుగా మన్షినల్ చెట్టుకు పేరుంది.

మనుషుల ప్రాణాలను తీసే చెట్లు మన్షినల్ చెట్లు ఉత్తర, దక్షిణ అమెరికా తీర ప్రాంతాల్లో  ఎక్కువగా ఉంటాయి. ఈ చెట్టు యొక్క ఆకులు, పండ్లు కూడా విషపూరితం. అంతేకాదు ఈ మన్షినల్ చెట్టు వదిలిన గాలి పీల్చితే శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడతాయట. ఇక చెట్టుమీద చేయి వేసినా ఆ చేతులకు కాలిన విధంగా బొబ్బలు ఏర్పడి.. ప్రాణాలను సైతం హరిస్తాయట. ఈ చెట్లకు కాసే పండ్లు చూడడానికి గ్రీన్ ఆపిల్స్ లా ఉంటాయి. ఇక వీటిని లిటిల్ ఆపిల్స్ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తారు.  ఈ మొక్కలు ఎంత డేంజర్ అంటే..

వర్షం కురిసిన సమయంలో ఈ చెట్టు నుంచి జారిపడిన నోటిబొట్టు శరీరంపై పడినా కూడా ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఈ చెట్టు కొమ్మల నుంచి వచ్చే తెల్లని స్రవం శరీరం మీద పడితే భరించలేని మంట వస్తుందట. ఈ చెట్టు పండుని కోరినా సరే విషయంగా పనిచేసి.. మనిషి మరణానికి కారణంగా మారుతోందట.

కరేబియన్ సముద్ర తీరంతో పాటు ఫ్లోరిడా తీరంలో కూడా ఈ చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. సుమారుగా 50 అడుగులవరకూ ఎత్తు పెరుగుతుంది.  ఈ చెట్టు కలపను ఫర్నీఛర్ తయారీ కోసం ఉపయోగిస్తారు. అయితే ఈ చెట్లను కలపగా సేకరించే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాదు చెట్లను కట్ చేసిన అనంతరం ఆ కలపను ఎండలో ఎక్కువ సమయం ఉంచుతారు.

Also Read:  జ్ఞాపకశక్తిని పెంచే బాస్మతి రైస్.. తరచుగా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..