Viral News: నీటి చుక్కని బంగారంగా మార్చేసిన శాస్త్రజ్ఞులు.. త్వరలో నీటి కోసం కూడా కొట్టుకోవాలేమో

|

Jul 31, 2021 | 11:13 AM

Viral News: ఓ వైపు రోజు రోజుకీ అడుగంటుతున్న భూగర్భ జలాలు.. దీంతో సేవ్ వాటర్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా అవగాహనా కార్యక్రమం సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నీటిని కూడా బంగారంగా..

Viral News: నీటి చుక్కని బంగారంగా మార్చేసిన శాస్త్రజ్ఞులు.. త్వరలో నీటి కోసం కూడా కొట్టుకోవాలేమో
Golden Metal
Follow us on

Viral News: ఓ వైపు రోజు రోజుకీ అడుగంటుతున్న భూగర్భ జలాలు.. దీంతో సేవ్ వాటర్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా అవగాహనా కార్యక్రమం సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నీటిని కూడా బంగారంగా మార్చవచ్చు అనే వార్తలు హల్ చేస్తున్నాయి. దీంతో ఇక నీటి బిందువుకూడా సామాన్యుడికి దొరకదా అనిపిస్తుంది మానవమేథస్సు చూస్తుంటే.. ఎందుకంటే బంగారం అంటే అందరికీ ఎంతో ఇష్టం.. ఎంత కాస్ట్ పెరుగుతున్నా సరే.. బంగారం కొనడం మంత్రం ఎవరూ మానడం లేదు.. అంటే అర్ధం చేసుకోవచ్చు బంగారానికి ఉన్న డిమాండ్ ను.. అలాంటి బంగారాన్ని నీటి బిందువుతో కూడా తయారు చేసుకోవచ్చు అని అంటున్నారు శాస్త్రవేత్తలు.

నీరు మనిషి జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకనే నదుల పక్కనే ప్రసిద్ధ నగరాలూ నాగరిక వెలసింది. అంతగా మానవ జీవితంపై నీరు ప్రభావం చూపిస్తుంది. అలాంటి నీరు ఇప్పుడు బంగారంగా మారిపోయింది. నీరు ఏమిటి బంగారం ఏమిటి అనుకున్నా ఇది నిజం.. అయితే ఇలా నీటిని బంగారంలాగా మార్చడం అంతా సులువైన విషయం కాదు అంటున్నారు శాస్ర్రవేత్తలు.

ఈ పక్రియలో అన్నిటికంటే ముఖ్యమైనది ‘టైమింగ్’ అంటున్నారు ప్రేగ్ లోని చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు.నిజానికి నీరు అనేది లోహం కాదు. అయితే ఇలా లోహాలు కాని చాలా వస్తువులను ఇప్పుడు లోహాలుగా మార్చి చూపించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.ఏ వస్తువులోని అణువులు, పరమాణువులను అన్నిటిని గ్యాప్ లేకుండా ఒక్కచోటకు చేర్చితే ఆ వస్తువు లోహంగా మారి, దాని చుట్టూ ఉండే బాహ్య ఎలక్ట్రాన్ల సమూహం ఆ సమయంలో విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇలా నీటిని లోహంగా మార్చాడానికి సుమారు కోటిన్నర అట్మాస్ఫియర్స్ పీడనం అవసరమన అందుకే అంత మొత్తంలో పీడనం అవసరం లేకుండానే నీటిని లోహంగా మార్చవచ్చు అంటున్నారు చెక్ అకాడమీ సైన్సెస్ శాస్త్రవేత్తలు.

కొన్ని క్షార లోహాల నుంచి ఎలక్ట్రాన్ లను తీసుకుని వాటిని నీటిపై ప్రయోగిస్తే చాలంటున్నారు శాస్త్రవేత్తలు. పొటాషియం, సోడియం వంటి మూలకాలతో సాధ్యమని అంటున్నారు. అయితే ఇలా నీటిని బంగారంగా మార్చే ప్రక్రియలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే మండే మృదు స్వభావం ఉన్న మూలకాలకు నీటి చుక్క తగిలితే పేళ్ళుల్లు జరిగే ప్రమాదం ఉందని.. కనుక ఇలా మూలకాల మధ్య చర్య జరిపే విషయంలో చాలా నెమ్మదిగా ప్రాసెస్ చేస్తారు. అంటే ఒక సిరంజీలో సోడియం, పొటాషియం ద్రావణాన్ని తీసుకుని దానిని ఓ వాక్యూమ్ చాంబర్ లో పెట్టి ఆ సిరంజీ నుంచి మెల్లగా సోడియం, పొటాషియం ద్రావణం బిందువులను విడుదల చేసి నీటి ఆవిరితో చర్య జరిపేలా శాస్త్రజ్ఞులు చేస్తారు. ఇలాంటి చర్యలో కొన్ని క్షణాల పాటు నీటి బిందువు బంగారంగా మరి అనంతరం మెరిసే లోగా తయారవుతుందని చెబుతున్నారు.

 

Also Read: Saving Electricity: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే విద్యుత్ ఆదాతో పాటు.. ఎలక్ర్టికల్ వస్తువులు సేఫ్