Mysterious Lake of No Return: ఈ సరస్సులోకి దిగినవారు తిరిగి రాలేదు.. ఇండియన్ బెర్ముడాగా పిలిచే ఈ పర్యాటక ప్రాంతం ఎక్కడుందో తెలుసా..

|

Aug 08, 2021 | 9:55 AM

Mysterious Lake of No Return: పర్వతాలు, అడవులు, లోయలు, సరస్సులు, అలనాటి రాజులు నిర్మించిన కోటలవంటి టూరిజం కేంద్రాలకు ప్రసిద్ది భారత దేశం...

Mysterious Lake of No Return: ఈ సరస్సులోకి దిగినవారు తిరిగి రాలేదు.. ఇండియన్ బెర్ముడాగా పిలిచే ఈ పర్యాటక ప్రాంతం ఎక్కడుందో తెలుసా..
Mysterious Lake Of No Retur
Follow us on

పర్వతాలు, అడవులు, లోయలు, సరస్సులు, అలనాటి రాజులు నిర్మించిన కోటలవంటి టూరిజం కేంద్రాలకు ప్రసిద్ది భారత దేశం. భారత దేశం ఓ పెద్ద టూరిజం స్పాట్ అని పిలుస్తారు. వీటిని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తారు. అయితే రహస్యం.. అంతు చిక్కని మర్మం ఉన్న.. ఎవరూ తేల్చని మిస్టరీ లేక్ ఒకటి  భారతదేశంలో ఒకటి ఉందని మీకు తెలుసా.  అక్కడికి వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదని చాలా మంది చెప్పుకుంటారు.

అవును, మీరు సరిగ్గా చదవండి.. భారత్- మయన్మార్ సరిహద్దుల్లోని అలాంటి ఒక సరస్సు ఉంది. దీనిని ‘లేక్ ఆఫ్ నో రిటర్న్’ అని పిలుస్తారు. కొన్ని రహస్య సంఘటనల కారణంగా ఈ సరస్సు ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతి పాలైంది. ఈ రోజు వరకు ఈ సరస్సు దగ్గరకు ఎవరు వెళ్లినా వారు తిరిగి రాలేదు.

రెండవ ప్రపంచ యుద్ధం కథ…

అయితే ఈ సరస్సు వెనుక ఓ పెద్ద కథ ప్రచారంలో ఉంది. ఈ మర్మమైన సరస్సు అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ పైలట్లు ఇది ఓ  చదునైన మైదానంలా ఊహించుకుని ఇక్కడ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని.. కానీ ఆ తర్వాత అది పైలట్‌లతో పాటు అదృశ్యమైందని చెబుతారు. సరిగ్గా ఇదే ప్రదేశంలో మరో ఘటన చోటు చేసుకుంది. అతడిని వెతికేందుకు ఈ సరస్సులోకి దిగిన అమెరికన్ సైనికులు కూడా తిరిగి రాలేదు.  

ఈ సరస్సుకి సంబంధించిన మరొక కథ చాలా ప్రజాదరణ పొందింది. దీని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కొందరు జపనీస్ సైనికులు ఈ సరస్సులోకి దిగారు. అందులోకి దిగిన ఆ సైనికులు కూడా తిరిగి రాలేదు. అప్పటి నుంచి ఇందులోకి దిగేందుకు ఎవరూ సహాసం చేయడం లేదు. ఇలాంటి ప్రచారం జరుగుతుండటంతో ఈ సరస్సుపై సినిమాలు, స్టోరీలు చాలా వచ్చాయి. అందుకే ఈ సరస్సును Mystery of Indian Bermuda అని.. Lake of No Return అని పిలుస్తున్నారు.  అయితే ఈ సరస్సును చూసేందుకు చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. కాని సరస్సులోకి మాత్రం దిగరు.. దూరంగా చూసి వెళ్లి పోతారు. 

ఇవి కూడా చదవండి: Gupta Nidhulu: ధనవంతులుగా మారండి.. ఆ గుప్తనిధులు మీ సొంతం కావచ్చు.. మాటల మాంత్రికులకు మోత మొగింది..

Neeraj chopra: భళి..భళిరా బల్లెం వీరా.. నీకు మా బంగారు స్వాగతం.. ఆకాశంలో చక్కర్లు కొట్టేందుకు ఇండిగో ఆఫర్..