Kangaroo Rat: ఈ జీవి నీరు తాగ‌కుండా జీవితం మొత్తం గ‌డిపేస్తుంది.. ఎలా సాధ్య‌మంటే..

|

May 18, 2021 | 7:22 AM

ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచం చాలా వింతగా ఉంటుంది. భూ ప్ర‌పంచంలోని కొన్ని జీవుల లైఫ్ స్టైల్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఓ వెరైటీ...

Kangaroo Rat: ఈ జీవి నీరు తాగ‌కుండా జీవితం మొత్తం గ‌డిపేస్తుంది.. ఎలా సాధ్య‌మంటే..
Rat Kangaroo
Follow us on

ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచం చాలా వింతగా ఉంటుంది. భూ ప్ర‌పంచంలోని కొన్ని జీవుల లైఫ్ స్టైల్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఓ వెరైటీ జీవి గురించి చెప్పబోతున్నాం. అది జీవితాంతం నీరు తాగకుండా కూడా సజీవంగా ఉంటుంది. అంతేకాదు.. అది ఏమీ తినకుండా కూడా చాలా సంవత్సరాలు జీవించగ‌ల‌దు. అవును, మనం మాట్లాడుతున్న జీవికి ‘కంగారూ ఎలుక’ అని పేరు పెట్టారు. ఈ జీవులు ఉత్తర అమెరికా ఎడారులలో కనిపిస్తాయి. దీని కాళ్ళు, తోక ఆస్ట్రేలియాలో కనిపించే కంగారుతో సమానంగా ఉంటాయి. దీంతో అవి ఎక్కువ‌దూరం దూక‌గ‌ల‌వు.

నీటి కొరత ఈ విధంగా అధిగ‌మిస్తుంది…

ఈ జీవి యొక్క బుగ్గల బయట సంచుల మాదిరి ఆకారం ఉంటుంది. వాటి ద్వారా ఆహార పదార్థాలను తెచ్చుకుని.. అవి దాచ‌కుంటాయి.ఈ జీవి తాగునీరు లేకుండా తన జీవితాన్ని గడపగలదని నిపుణులు చెబుతున్నారు. ఎడారిలో, మనుగడ సాగించే జంతువులు, మొక్కలకు మాత్రమే తక్కువ నీరు అవసరమని మనందరికీ తెలుసు. అలానే ఈ ఎలుక శ‌రీర నిర్మాణాన్ని బ‌ట్టి చాలా త‌క్కువ నీరు అవ‌సరం. ఎడారిలో పెరిగే చెట్లు, మొక్కల మూలాలను తినడం ద్వారా దాని నీటి అవసరాలను నెరవేరుస్తుంది. మొక్కల మూలాల్లో ఖచ్చితంగా కొంత తేమ ఉంటుంది. దాన్ని అది వినియోగించుకుంటుంది

‘కంగారూ ఎలుక’ మూత్రపిండం చాలా బలంగా పనిచేస్తుంది. ఇది శరీరంలోని నీటి అవసరాలను కేవ‌లం తేమతో మాత్రమే నెరవేరుస్తుంది. ఈ తేమ దాన్ని సజీవంగా ఉంచడానికి సరిపోతుంది. కానీ దాని శరీరంలో నీరు అధికంగా ఉండటం వల్ల ఇతర జంతువులు దీనిని ఎక్కువ‌గా అటాక్ చేస్తాయి. ఇది చాలా వేగంగా ప‌రిగెత్తుతుంది. దీని తోక 20 సెం.మీ, శరీరం దాదాపు 38 సెం.మీ ఉంటుంది. దాని ముందు కాళ్ళు చిన్నవి, తల పెద్దది.. కళ్ళు కూడా చిన్నవి. ఇది సెకనులో 06 మీటర్ల దూరాన్ని దాటుతుంది. శత్రువులు వెంట ప‌డుతున్నప్పుడు అది ఊహించ‌ని వేగాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంది. గాలిలో దిశను మార్చడానికి త‌న పొడవాటి తోకను ఉపయోగిస్తుంది. కంగారూ ఎలుకలు ఉచ్చులను త‌ప్పించుకోడానికి లాంగ్ జంప్‌లు కూడా చేస్తాయి.

Also Read:  పెరుగుతున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..

తెలంగాణ ఎంసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా..