Old Man eating stones: ఈ వ్యక్తి 32 ఏళ్లగా కేవలం రాళ్లు మాత్రమే తిని జీవిస్తున్నాడు.. రోజుకో పావు కేజీ

|

Mar 07, 2021 | 6:21 PM

ప్రపంచంలో వింత వ్యక్తుల కొరత లేదు. ప్రపంచవ్యాప్తంగా వింత ప్రవర్తించేవాళ్లను.. సూపర్ పవర్స్ ఉన్నవాళ్లను చాలామందిని చూస్తున్నాం. వారికి ఆ పవర్స్ ఎలా వచ్చాయి అనేది ఇప్పటికీ ఆశ్యర్యకరమే.

Old Man eating stones: ఈ వ్యక్తి 32 ఏళ్లగా కేవలం రాళ్లు మాత్రమే తిని జీవిస్తున్నాడు.. రోజుకో పావు కేజీ
ఈ వ్యక్తి ప్రతిరోజూ 250 గ్రాముల రాయిని తింటాడు
Follow us on

ఈ ప్రపంచంలో వింత వ్యక్తులకు కొరత లేదు. ప్రపంచవ్యాప్తంగా వింతగా ప్రవర్తించేవాళ్లను.. సూపర్ పవర్స్ ఉన్నవాళ్లను చాలామందిని చూస్తున్నాం. వారికి ఆ పవర్స్ ఎలా వచ్చాయి అనేది ఇప్పటికీ ఆశ్యర్యకరమే. మరికొన్ని అయితే స్వయంగా చూస్తే కానీ నమ్మలేం. మహారాష్ట్రలోని అలాంటి ఆసక్తికర విషయాన్ని మీ ముందుకు తేబోతున్నాం.  గత 32 సంవత్సరాలుగా ఒక వ్యక్తి కేవలం రాళ్లు మాత్రమే తింటూ జీవిస్తున్నాడు. ఆహా.. అంత సీన్ లేదు అంటూ నిట్టూర్పులు ఇవ్వకండి, ఇది పూర్తిగా నిజం.

 దీని వెనుక కారణం ఏమిటో తెలుసుకుందాం?

ప్రజలు సాధారణంగా సజీవంగా ఉండటానికి వివిధ రకాల ఆహారాన్ని తింటూ ఉంటారు. కానీ, సజీవంగా ఉండటానికి రాళ్లు తింటున్న వ్యక్తి కూడా ఈ భూ ప్రపంచ మీదే ఉన్నాడు. మహారాష్ట్రలోని సత్రా జిల్లాలోని అదార్కి ఖుర్ద్ గ్రామంలో రామ్‌దాస్ బోడ్కే అనే వ్యక్తి నివశిస్తున్నాడు. అతడు గత 32 సంవత్సరాలుగా రాళ్ళు మాత్రమే తిని అందరిలాగానే జీవనం సాగిస్తున్నాడు. వివరాలు ప్రకారం, రామ్‌దాస్ ప్రతిరోజూ 250 గ్రాముల రాళ్లను తింటున్నాడు. ఒకప్పుడు ఆయనకు చాలా కడుపు నొప్పి వచ్చిందని, ఆ తర్వాత రాళ్లు తినడం ప్రారంభించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

1989 నుండి రాళ్లు తినడం ప్రారంభించాడు…

రాడాస్ బోడ్కేకు 1973 సంవత్సరంలో కడుపు నొప్పి సమస్య వచ్చిందట. అతను చాలాకాలం చికిత్స పొందాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. కడుపు నొప్పి సమస్యతో విసిగి వేసారిపోయాడు. దీని తరువాత గ్రామంలో నివసిస్తున్న ఒక వృద్ద మహిళ రాళ్లు తినమని సలహా ఇచ్చింది. అన్నీ మందులు ట్రై చేశాం.. ఇది ఎందుకు ప్రయత్నించకూడదని, అతను రాళ్లు తినడం ప్రారంభించాడు. ఊహించని విధంగా అతనికి రిలీఫ్ లభించింది. అప్పటి నుంచి అతను రాళ్లు తినడం ప్రాంభించాడు. అదే ప్రక్రియ ఈ రోజుకూ కొనసాగుతుంది. ఈ విషయం ప్రజలతో పాటు డాక్టర్లకు కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది. దీంతో సెలబ్రిటీ కూడా అయిపోయాడు రామ్‌దాస్. ఇప్పటికీ ఆయన రాళ్లు తినడం చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి జనం వస్తూ ఉంటారు.

Also Read:

తెలంగాణలోని ఆ ప్రాంతంలో చేపలు విషపూరితం.. తిన్నారో అంతే సంగతులు

ఆ కొండంతా బంగారమే.. తవ్వుకున్నోడికి..తవ్వుకున్నంత..