Viral News: నాటకంలో ఓవర్‌గా ఇన్వాల్వ్ అయ్యాడు.. సహపాత్రదారిని చంపబోయాడు.. చివరికి

|

Feb 25, 2021 | 10:33 PM

కర్ణాటకలో నిర్వహించిన ఓ నాటక సన్నివేశంలో.. పాత్రలోకి లీనమై హత్యాయత్నానికి పాల్పడ్డాడో వ్యక్తి. అయితే.. నిర్వాహకులు స్పందించి అడ్డుకోవడం వల్ల.. త్రుటిలో ప్రమాదం తప్పింది. 

Viral News: నాటకంలో ఓవర్‌గా ఇన్వాల్వ్ అయ్యాడు.. సహపాత్రదారిని చంపబోయాడు.. చివరికి
Follow us on

కర్ణాటకలో నిర్వహించిన ఓ నాటక సన్నివేశంలో.. పాత్రలోకి లీనమై హత్యాయత్నానికి పాల్పడ్డాడో వ్యక్తి. అయితే.. నిర్వాహకులు స్పందించి అడ్డుకోవడం వల్ల.. త్రుటిలో ప్రమాదం తప్పింది.  ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చే నాటక సన్నివేశంలో అపశృతి తలెత్తింది. చాముండేశ్వరీ పాత్ర ధరించిన ఓ వ్యక్తి.. ఆ పాత్రలోకి లీనమై రాక్షస (మహీషుడు) పాత్రలోని వ్యక్తిపై ఏకంగా హత్యయత్నానికి పాల్పడ్డాడు. కర్ణాటకలోని మాండ్య కళామందిర్​లో ఈ నెల 6న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

డ్రామాలో భాగంగా కౌండాలికా సన్నివేశంలో చాముండీ పాత్రలోని వ్యక్తి మహీషుడిపై త్రిశూలంతో దాడి చేసి, హతమార్చేందుకు ప్రయత్నించాడు. అయితే.. వెంటనే నిర్వాహకులు అడ్డుకోవడం వల్ల.. ప్రమాదం తప్పినట్టయింది. దీంతో జనం ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. కళాకారులంతా తమ కళను ఎంతో గౌరవిస్తారు. తమకు ఎంత చిన్న పాత్ర వచ్చినా దాన్ని రక్తికట్టించేందుకు ప్రయత్నిస్తారు. పరిధికి మించితే మాత్రం ఇబ్బందులు తప్పవు. కర్ణాటకలో అదే జరిగింది. అయితే అక్కడున్న జనం, నిర్వాహకులు ఈ సీన్ చూసి కంగుతిన్నారు. నెటిజన్లు కూడా మరీ అంత పరకాయప్రవేశం అక్కర్లేదు గురూ అంటూ కౌంటర్లు వేస్తున్నారు. రంగస్థలం అంటే సినిమా షాట్, సీన్‌ వరకు మాత్రమే కాదు.  పాత్ర ముగిసే వరకూ అందులో జీవించాల్సి ఉంటుంది. అందుకే అతడు క్యారెక్టర్ మూడ్‌లో అలా చేసి ఉండొచ్చని మరికొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ వైరల్ క్లిప్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

Also Read:

Mars: భూమికి మనం ఏలియన్స్‌గా వచ్చామా..? మార్స్‌ మన సొంత ఊరా..?.. ఆసక్తికర వివరాలు మీ కోసం..

ఎదురీత ముందు.. విధిరాత ఎంత..?.. కష్టాల దిగమింగి.. కన్నీళ్లను చెరిపేసి.. మెకానిక్‌గా మహిళ జీవనపోరాటం

India Corona: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి.. ప్రమాద ఘంటికలు.. జాగ్రత్తలు పాటించకపోతే అంతే.. !

Dr. Noori Parveen: సలాం డాక్టరమ్మా..! పది రూపాయలకే వైద్యం.. ‌భవిష్యత్ తరాలకు ఆదర్శం