ఈ ప్రపంచం అనేక వింత విషయాలతో నిండి ఉంది. ఎప్పటికప్పుడు, అనేక క్రేజీ విషయాలు తెరపైకి వస్తూనే ఉంటాయి. అది మానవ సంబంధమైన విషయం అయినా, జంతువు గురించి అయినా, ప్రకృతి గురించి అయినా చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. ఈ రోజు మీ ముందుకు ఓ వింత విషయాన్ని తీసుకొచ్చాం. దాని గురించి చెప్పగానే మీకు ఆశ్యర్యం కలగటం ఖాయం. అంతే కాదు అసలు ఇది నిజమేనా అనే ఆలోచన కూడా మీకు కలుగుతుంది. ఇప్పుడు మేము చెప్పబోయే విషయం మనిషి లేదా జంతువులకు సంబంధించిన కాదు. ఒక వినూత్నమైన చెట్టు గురించి. దీని స్పెషాలిటీ ఏంటి అంటే.. ఇది మనుషుల లాంటి ఒక స్వభావాన్న కలిగి ఉంది.
మీరు మీ జీవితంలో చాలా చెట్లను చూసి ఉంటారు. వాటికి సంబంధించిన అనేక కథలను మీరు వినే ఉంటారు. కానీ, మీరు నవ్వుతున్న చెట్టును చూశారా అని అడిగితే, ఖచ్చితంగా మీ సమాధానం లేదు అనే వస్తుంది. చెట్టు కూడా నవ్వుతుందని ఎవరైనా చెబితే వింతగా అనిపిస్తుంది. కానీ, ఉత్తరాఖండ్‌లోని కలధుంగిలో అలాంటి ఒక చెట్టు ఉంది. దాన్ని ఎవరైనా తాకితే నవ్వుతుంది. ఒక వ్యక్తి చేయి తగిలిన వెంటనే ఈ చెట్టుకు చక్కిలిగింత మొదలవుతుంది. దాని బెరడుకు మీ చేతులు తాకితే చాలు, దాని కొమ్మలు కదలడం ప్రారంభిస్తాయి. అందుకే, ప్రజలు ఈ చెట్టును నవ్వుతున్న చెట్టు అని పిలుస్తారు.
అందుతోన్న నివేదిక ప్రకారం, ఈ ‘నవ్వుతున్న’ చెట్టు బొటానికల్ పేరు ‘రాండియా డుమిటారమ్’. కాగా ఇక్కడ అందరి మనసుల్లో ఓ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. చేతితో తాకగానే , ఈ చెట్టుకు ఎందుకు ‘చక్కిలిగింతలు’ మొదలువుతున్నాయి. దీనిపై అనేక పరిశోధనలు కూడా జరిగాయి. ఇప్పుడు కూడా నిరంతరం జరుగుతున్నాయి. అయితే, ఇంతవరకు ఎటువంటి నిర్ధారణకు రాలేదు. ఈ నవ్వే చెట్టు గురించి తెలుసుకునేందుకు ప్రజలు చాలా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ చెట్టును చూసేందుకు ప్రజలు ఎల్లప్పుడూ ఆ ప్రాంతానికి వస్తూనే ఉంటారు. ఈ చెట్టును తాకి.. ఆ క్రేజీ ఫిలింగ్‌ను అనుభవిస్తారు. కాబట్టి మీరు కూడాఎప్పుడైనా కలధుంగి వెళ్లినప్పుడు, ఖచ్చితంగా ఈ చెట్టును చూడండి. దాన్ని తాకి ఆ అనూభూతిని మీరు కూడా ఆస్వాధించండి.
Also Read: Variety Laddoos: పురావస్తుశాఖ తవ్వకాల్లో దొరికిన 7 విచిత్రమైన లడ్డూలు.. పరిశోధనలో విస్తుపోయే విషయాలు
ఏపీలో కరోనా స్వైర విహారం.. కొత్తగా 947 పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది