Rare Bird: నల్లమల అటవీ ప్రాంతంలో క‌నిపించిన అరుదైన ‘అడవి రైతు’ ప‌క్షి.. పాములు, బల్లులు దాని ఆహారం.. ఇంకా

అడవి రైతుగా పిలవబడే అరుదైన ఇండియన్ గ్రేహార్న్ బిల్ పక్షి తాజాగా నల్లమల అటవీ ప్రాంతంలో కనువిందు చేసింది. సాధారణంగా భారత ఉపఖండంలో...

Rare Bird: నల్లమల అటవీ ప్రాంతంలో క‌నిపించిన అరుదైన అడవి రైతు ప‌క్షి.. పాములు, బల్లులు దాని ఆహారం.. ఇంకా
Indian Grey Hornbill

Updated on: May 28, 2021 | 6:16 PM

అడవి రైతుగా పిలవబడే అరుదైన ఇండియన్ గ్రేహార్న్ బిల్ పక్షి తాజాగా నల్లమల అటవీ ప్రాంతంలో కనువిందు చేసింది. సాధారణంగా భారత ఉపఖండంలో మాత్రమే కనిపించే ఈ జాతి పక్షి.. నల్గొండ జిల్లా చందంపేట పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో కెమెరాకు చిక్కింది. ప్రస్తుతం దీనికి సబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ స‌ర్కులేట్ అవుతున్నాయి. ఈ పక్షికి 50 సెంటీమీటర్ల పొడవైన ముక్కుతో పాటు పొడవైన తోక ఉంటుందని అటవీశాఖ అధికారులు చెప్పారు. నలుపు, తెలుపు, బూడిద రంగు కలబోతతో ఉండే ఈ గ్రేహార్న్ బిల్ ఇతర పక్షుల మాదిరిగా కాకుండా ఎత్తయిన చెట్లపైన, అటవీ ప్రాంతం, కొండలు, గుట్టలపై సంచరిస్తుందని వారు తెలిపారు.

అలాగే ఈ పక్షి మట్టి గుళికలు, అత్తి చెట్లు, పాములు, బల్లులను ఆహారంగా తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు. దీనిని అడవిరైతు, ఫారెస్ట్‌ ఇంజనీర్ అని కూడా పిలుస్తారని చెప్పారు. కాగా నల్లగొండ జిల్లా చందంపేట మండలం నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వేసవి కావడంతో వాటి దాహార్తిని తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు వంద నీటితొట్లను కూడా ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నీటి తొట్ల సమీపంలో సేద తీరుతున్న అరుదైన జంతువులు, ప‌క్షుల‌ వివరాలను అక్కడి అధికారులు ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేస్తున్నారు.

Also Read: ఉల్లిగడ్డపై నల్లని పొర వల్ల బ్లాక్​ ఫంగస్​ వస్తుందా…? ఇదిగో క్లారిటీ

ఏపీలో మ‌రో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు.. నేడు లేదా రేపు స‌ర్కార్ ఉత్త‌ర్వులు !