Groom Received Bulls as Dowry : ఈడొచ్చిన ఆడ పిల్లలు ఇంట్లో ఉంటే చాలు.. తల్లిదండ్రులు ఎప్పుడు పెళ్లి చేద్దామా.. అంటూ చూస్తుంటారు.. అందుకోసం అబ్బాయిని వెతుకుతూ ఉంటారు. అందుకోసం అబ్బాయి ఏం చదువుకున్నాడు.. ఉద్యోగం చేస్తున్నాడా లేదా తదితర విషయాలన్నింటిని ఆరా తీస్తూ ఉంటారు. అంతేకాకుండా కట్నం ఎంతివ్వాలి.. కార్లు, బైకులు ఇవ్వాలా లేదా అంటూ సవాలక్ష ఆలోచిస్తారు.. కానీ తెలంగాణలోని గిరిజన జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. వధువు తల్లిదండ్రులు వరుడికి ఎద్దులను కట్నంగా ఇచ్చి నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం వైజాపూర్ గ్రామానికి చెందిన యువతిని అదిలాబాద్ మండలం ఛిచూధర్ ఖానాపూర్ గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయించారు. వరుడి స్వగృహంలో పెళ్లి జరగ్గా.. వరుడికి అత్తింటివారు ఎడ్లను కట్నంగా ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వింతను చూసిన జనాలు ఇదేమిటి ఎడ్లను కట్నంగా ఇవ్వడమేంటని ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఈ విషయం గురించి అందరు చర్చించుకోవడం మొదలెట్టారు.