పాములు ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి..! అడవిలో ఉన్న పాముకి బంధించిన పాముకి తేడా ఏంటి..?

మానవులే కాకుండా భూమిపై మిలియన్ల జాతుల జంతువులు ఉన్నాయి. ఈ జాతులలో చాలా జాతులు ప్రమాదకరమైనవి. ఇవి మానవజాతికి

పాములు ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి..! అడవిలో ఉన్న పాముకి బంధించిన పాముకి తేడా ఏంటి..?
Snake Bites

Updated on: Jul 08, 2021 | 5:56 AM

మానవులే కాకుండా భూమిపై మిలియన్ల జాతుల జంతువులు ఉన్నాయి. ఈ జాతులలో చాలా జాతులు ప్రమాదకరమైనవి. ఇవి మానవజాతికి భారీ హాని కలిగిస్తాయి. ఇందులో చెప్పాలంటే పాములు చాలా ప్రమాదకరమైనవి. ప్రపంచంలో పాముల వల్ల ప్రతి సంవత్సరం సగటున 1,38,000 మంది చనిపోతున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పాముల వల్ల చనిపోయిన వారి సంఖ్య సింహం, ఏనుగు, హిప్పోపొటామస్, మొసలితో చంపేసిన సంఖ్య కంటే చాలా రెట్లు ఎక్కువ. పాము విషం ఒక్క చుక్క మానవుడిని చంపడానికి సరిపోతుంది.

ప్రపంచంలో కనిపించే అత్యంత ప్రమాదకరమైన పాములలో ఇన్లాండ్ తైపాన్, బ్లాక్ మాంబా, రస్సెల్ వైపర్, కింగ్ కోబ్రా, ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ వంటి జాతులు ఉన్నాయి. ఈ పాములు చాలా విషపూరితమైనవి. ఒక వ్యక్తి మరణించడానికి వాటి విషంలో ఒక చుక్క సరిపోతుంది. కానీ పాము గరిష్ట వయస్సు ఎంత అది ఎన్ని సంవత్సరాలు జీవించగలదో తెలుసుకుందాం. వేర్వేరు పాములు వేర్వేరు వయస్సులను కలిగి ఉంటాయి. అడవులలో స్వేచ్ఛగా నివసించే పాములకు తక్కువ ఆయుర్దాయం ఉంటుంది. జంతుప్రదర్శనశాలలలో లేదా మరే ఇతర మార్గాల్లో బందిఖానాలో నివసించే పాములు ఎక్కువ కాలం బతుకుతాయి.

Reptilekingdoms.com నివేదిక ప్రకారం.. బందిఖానాలో నివసించే పాముల సగటు ఆయుర్దాయం 13 నుంచి18 సంవత్సరాలు. అడవులలో నివసించే పాముల సగటు జీవితం 10 నుంచి15 సంవత్సరాలు మాత్రమే. నివేదిక ప్రకారం బాల్ పైథాన్ జాతుల పాములు ఇతర పాములతో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తాయి. గ్యారీ అనే పాముపై అతిపెద్ద జీవిత రికార్డు నమోదైంది. బాల్ పైథాన్ జాతుల పాములు 25 నుంచి 30 సంవత్సరాల వరకు బందిఖానాలో ఉంటాయి. గ్యారీ అనే బాల్ పైథాన్ పాము 42 సంవత్సరాలు జీవించింది. ఈ పామును ఒక మహిళ పెంచుకుంది. గ్యారీ జీవితం ఒక అద్భుతం అలాగే ప్రపంచ రికార్డు కూడా.

Nishith Pramanik : మోదీ కేబినెట్‌లో అతి పిన్న వయస్కుడు..! ప్రైమరీ టీచర్ నుంచి సెంట్రల్ మినిస్టర్ వరకు అతడి ప్రయాణం..

పిడుగు పడటాన్ని ముందే గుర్తించవచ్చా..! అసలు పిడుగు అంటే ఏమిటీ.. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోండి..

Cabinet Expansion 2021: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో యువతకు ప్రాధాన్యం..! 50 ఏళ్ల కన్నా తక్కువున్న 9 మందికి అవకాశం..