Viral News: రాత్రుళ్లు గుర్రంపై ఊరేగుతున్న తలలేని దెయ్యం.. అక్కడ నిద్రపోతే ఇక అంతే.. బెంబేలెత్తుతున్న జనం!

ప్రస్తుత కాలంలో దెయ్యాలు, ఆత్మలను విశ్వాసించే వారు చాలా మందే ఉన్నారు. ఇప్పటికీ దెయ్యాలు... ఆత్మలు కనిపిస్తాయని.. వాటి కోరికలు తీర్చుకోవడానికి

Viral News: రాత్రుళ్లు గుర్రంపై ఊరేగుతున్న తలలేని దెయ్యం.. అక్కడ నిద్రపోతే ఇక అంతే.. బెంబేలెత్తుతున్న జనం!
Ghost Story
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 25, 2021 | 10:06 AM

ప్రస్తుత కాలంలో దెయ్యాలు, ఆత్మలను విశ్వాసించే వారు చాలా మందే ఉన్నారు. ఇప్పటికీ దెయ్యాలు… ఆత్మలు కనిపిస్తాయని.. వాటి కోరికలు తీర్చుకోవడానికి తిరుగుతుంటాయని అంటుంటారు. అయితే మారుతున్న కాలంతోపాటు దెయ్యాలు, భూతాలు అనేవి ఉండవు… కేవలం మనుషులలో ఉండే అపోహాలు మాత్రమే అని కొందరు శాస్త్రవేత్తలు కొట్టిపడేశారు. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో దెయ్యాలు ఉన్నాయని… అక్కడివారిని పిడీస్తున్నాయని అంటుంటారు. ఇటీవల దెయ్యాలకు సంబంధించిన స్టోరీలు.. వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

గతంలో జనగాంలోని ఓ గ్రామం మొత్తం దెయ్యం భయంతో ఖాళీ అయిన సంగతి తెలిసిందే. అలాగే.. స్వాలా ఉత్తరాఖండ్ చంపపత్ జిల్లాలోని ఓ గ్రామం మొత్తం దెయ్యాల భయంతో ఖాళీ అయ్యింది. ఇప్పటికీ ఆ గ్రామాన్ని భూత్ విలేజ్ గా పిలుస్తుంటారు. అయితే ఇప్పుడు అలాంటి స్టోరీనే మరోచోట వినిపిస్తోంది. ఉత్తరాఖండ్ లోని లాన్స్‏డౌన్ ప్రాంతంలో దెయ్యం తిరుగుతుందట. ఇది ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిమ్లా, ముస్సురీ పర్యాటకులు ఈ లాన్స్‏డౌన్ ప్రాంతానికి వస్తుంటారు. అయితే ఇక్కడ రాత్రి 8.30 తర్వాత ఏ ఒక్కరు ఉండరు. ఈ ప్రాంతంలో రాత్రిళ్లు తలలేని దెయ్యం తిరుగుతుందని చెబుతుంటారు. తలలేని ఓ ఆంగ్లేయుడు అర్ధరాత్రిళ్లు గుర్రం పై తిరుగుతుంటారట. అక్కడ డ్యూటీ చేస్తున్న సైనికులపై నిఘా పెడుతుందట. అంతేకాదు.. అక్కడ ఎవరైనా నిద్రపోతున్నట్లు కనిపిస్తే అస్సలు మంచిది కాదు. అక్కడ రాత్రిపూట వింత శబ్దాలు కూడా వస్తుంటాయి.

1893లో బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ డబ్ల్యూ.హెచ్. వార్డెల్ ఇండియాకు వచ్చాడు. అతడిని లాన్స్‏డౌన్ కంటోన్మెంట్ కామాండింగ్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆ తర్వాత 1901-02 సమయంలో అతను ఆఫ్రికాకు వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ ఇండియాకు వచ్చాడు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అతడు లాన్స్‏డౌన్ లో విధులు నిర్వహిస్తుండేవాడు. మొదటి ప్రపంచ యుద్దం సమయంలో అతడు జర్మనీకి వ్యతిరేకంగా పోరాడతూ ఫ్రాన్స్ లో చనిపోయాడు. ఆ తర్వాత అతని శరీరం ఎవరికి దొరకలేదు. అతను లాన్స్‏డౌన్ లో ఎక్కువ కాలం విధులు నిర్వహించడం వలన అతని ఆత్మ ఆ ప్రాంతం మీద మక్కువతో అక్కడే తిరుగుతుందట.

Also Read: Sudheer-Rashmi: సుధీర్‏కు ముద్దుపేరు పెట్టుకున్న రష్మి.. అలాగే పిలుస్తానంటూ షాకిచ్చిన ముద్దుగుమ్మ..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!