భారీ మొసలి వైట్ షార్క్ ని ఎలా పట్టేసిందో ! ఎర ఇక ‘నైస్’ ఫుడ్, క్వీన్స్ ల్యాండ్ వరదల్లో విచిత్రం !

ఆస్ట్రేలియాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు నదులు పోటెత్తి ప్రవహిస్తుండగా అక్కడి సముద్రం కూడా హోరెత్తుతోంది. నదుల నీరంతా సముద్రంలోకి చేరుతుండడంతో నీటి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.

భారీ మొసలి వైట్ షార్క్ ని ఎలా పట్టేసిందో ! ఎర ఇక నైస్ ఫుడ్, క్వీన్స్ ల్యాండ్ వరదల్లో విచిత్రం !
Gigantic Crocodile Swallows A Shark In Australia

Edited By: Anil kumar poka

Updated on: Mar 27, 2021 | 11:38 AM

ఆస్ట్రేలియాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు నదులు పోటెత్తి ప్రవహిస్తుండగా అక్కడి సముద్రం కూడా హోరెత్తుతోంది. నదుల నీరంతా సముద్రంలోకి చేరుతుండడంతో నీటి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ముఖ్యంగా న్యూసౌత్ వేల్స్, క్వీన్స్ ల్యాండ్ వంటి ప్రాంతాల్లో అలలు సుమారు ఎనిమిది, తొమ్మిది అడుగుల ఎత్తువరకు ఎగస్తున్నాయి.  ఇంతటి మహా జల రాశిలో మొసళ్ళు తమ ఆహారంకోసం విస్తృతంగా వేట సాగిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఓ టూరిస్టు అదే పనిగా ఈ సముద్ర ‘సౌందర్యాన్ని’ తన కెమెరాలో బంధిస్తూ ఆగిపోయాడు. అంతే ! ఒక దశలో అతని కెమెరా అద్భుతమైన దృశ్యాన్ని క్యాప్చర్ చేసింది. ఓ భారీ మొసలి ఒక   వైట్ షార్క్  చేపను అవలీలగా పట్టి మింగేసింది. ఇదంతా అతని కళ్ళ ముందు కొన్ని క్షణాల్లో జరిగిపోయింది. ఆ మొసలి బారి నుంచి తప్పించుకోవడానికి ఆ షార్క్ విశ్వ ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. తన ఫుడ్ కోసం ఈ భారీ మొసలి తన పళ్లతో ఆ షార్క్ కి పెట్టిన గాట్లు..షార్క్ చేసే  గాట్లు కన్నా  పది రెట్లు ఎక్కువని సముద్ర జంతు నిపుణులు చెబుతున్నారు.

Gigantic Crocodile Swallows A Shark In Australia 2

తన జీవితంలో ఎన్నడూ ఇంతటి ‘సముద్ర వేట’ను చూడలేదని ఆ టూరిస్టు చెబుతున్నాడు. ఈ మొసలి బహుశా 12 నుంచి 15 అడుగుల పొడవు ఉంటుందని అతని అంచనా.. ఇన్ని దేశాలు తిరిగినా ఇలాంటి  ఫోటోలను తన కెమెరా ఎప్పుడూ క్యాప్చర్ చేయలేదని సంతోష పడిపోతున్నాడు.

Gigantic Crocodile Swallows A Shark In Australia 3

మరిన్ని చదవండి ఇక్కడ :బాతుపిల్లకు సాయంచేసిన మనసున్న మృగరాజు వీడియో.. ముచ్చట పడుతున్న నెటిజన్లు

పురోహితుల క్రికెట్ లీగ్‌ మీరు ఎప్పుడైనా చూశారా..!సిక్సర్లు,ఫోర్లతో దుమ్ములేచిన గ్రౌండ్ : Pandits Cricket League video.

Telangana: లాక్ డౌన్ పెట్టేది లేదు అని తేల్చి చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… ( వీడియో )