Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కుమార్తెకు ప్రేయసి పేరు పెట్టిన వ్యక్తి.. పాపం భార్యకు తెలీదు.. ఒకరోజు ఏం జరిగిందంటే..?

తల్లిదండ్రులు తమ బిడ్డకు పేరు పెట్టడానికి ముందు చాలా ఆలోచిస్తారు. కొంతమంది మంచి అర్ధాన్నిచ్చే పేర్ల కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతారు. మరికొందరు...

Viral News: కుమార్తెకు ప్రేయసి పేరు పెట్టిన వ్యక్తి.. పాపం భార్యకు తెలీదు.. ఒకరోజు ఏం జరిగిందంటే..?
Man Cheates Wife
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 15, 2021 | 10:35 AM

తల్లిదండ్రులు తమ బిడ్డకు పేరు పెట్టడానికి ముందు చాలా ఆలోచిస్తారు. కొంతమంది మంచి అర్ధాన్నిచ్చే పేర్ల కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతారు. మరికొందరు తమ పూర్వికులు లేదా దేవుళ్ల పేర్లు వచ్చేలా పెట్టుకుంటారు. చాలా మంది తమ పిల్లలకు తమ అభిమానించే వాళ్ల పేర్లు పెడతారు. ఇంకొంతమంది అయితే కాస్త ముందుచూపుతో ఆలోచించి.. ఫ్యూచర్‌లో తమ పిల్లలకు పేరు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా కాస్త ట్రెండీ నేమ్స్ సెలక్ట్ చేసుకుంటారు.  అయితే, తన తప్పు తెలియకుండా ఉండటానికి ఒక వ్యక్తి తన కుమార్తెకు పేరు పెట్టాడు. అవును, తన ప్రేయసి వ్యవహారం గురించి ఎవరికీ తెలియకూడదనే ఆలోచనతో అతను కూతురుకు పేరు పెట్టాడు.

అమెరికాలోని కెంటుకీలో ఒక వ్యక్తి తన కుమార్తెకు తన ప్రేయసి పేరు పెట్టాడు. తన అక్రమ సంబంధాన్ని ఇంట్లో తెలియనివ్వకూడదని అతను అనుకున్నాడు. అయినప్పటికీ, అతను ప్లాన్ చేసినట్లు జరగలేదు. బిడ్డ పుట్టిన కొద్ది నెలలకే అసలు రహస్యం బయటపడింది. దీని తరువాత అతడి ఇంట్లో చాలా గందరగోళం చెలరేగింది. తన తండ్రి ఆమె ప్రియురాలు పేరు తనకు పెట్టారని  తాజాగా ఓ యువతి టిక్ టాక్ వేదికగా వెల్లడించింది. ఆమె పుట్టకముందే, తల్లిదండ్రులు అబ్బాయి పుడితే తల్లి.. అమ్మాయి పుడితే తండ్రి పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారట. అమ్మాయి జన్మించడంతో, తండ్రి ఆమెకు క్రిస్టినా అని పేరు పెట్టారు. ఆమె తల్లి కూడా నేమ్ బానే ఉందని ఆనందపడింది. వాస్తవానికి కుమార్తెకు ఈ పేరు ఎందుకు ఎంచుకున్నారో తల్లికి తెలియదు. కొన్ని నెలల తరువాత తన తండ్రి మోసం చేస్తున్న విషయం తల్లికి తెలిసిపోయిందట. ఇంట్లో అనుకోకుండా ప్రేయసి పేరును ప్రస్తావిస్తే దొరికిపోకుండా ఉండేందుకు.. అతడు ఈ పని చేశాడట. దీంతో తమ ఇంట్లో అనేక గొడవలు జరిగాయని సదరు యువతి వివరించింది.

Also Read: శుభలేఖ తెచ్చిన తిప్పలు.. ఆగిపోయిన పెళ్లి.. అసలు ఏం జరిగిందంటే..?

 హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్.. ఆ జిల్లాలలో కూడా.. రానున్న గంటల్లో భారీ వర్ష సూచన