ఊరంతా వనవాసానికి బయలుదేరింది. నిజమే ఈ ఊరు ఊరంతా అడవి బాట పట్టింది. అన్ని ఇళ్లకూ తాళాలు వేసి మరీ వెళ్లిపోయారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో గల ఈ ఊరి పేరు డోకూరు. ఇంతకూ అందరూ ఇలా ఎందుకు అడవి బాటపట్టారని తెలుసుకుందాం పదండి.
మహబూబ్‌నగర్‌జిల్లా దేవరకద్ర మండలం డోకూరుగ్రామ ప్రజలు వనవాసానికి వెళ్లారు. గ్రామంలో నిత్యం ఎవరో ఒకరు చనిపోతున్నారు. ఇప్పటివరకూ వరుసగా 12 మంది చనిపోయారు. దీంతో తమ గ్రామానికి ఏదో అరిష్టం పట్టుకుందని గ్రామస్తులు భావిస్తున్నారు. అందుకే ఒకరోజు ఊరువిడిచి పెట్టాలని మూకుమ్మడి నిర్ణయానికి వచ్చారు. పిల్లా, పెద్దా అంతా కలిసి తట్టాబుట్ట సర్దుకుని ఇలా పొలాలకు పయనమయ్యారు.
గతంలో అంటురోగాలు ప్రబలినప్పుడు గ్రామం విడిచి వనవాసానికి వెళ్లే వాళ్ళమని ఇక్కడివారు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో వరుస మరణాలు భయపెడుతున్న క్రమంలో.. పిల్లాజెల్లా, గొడ్డు, గోదా అందరం ఎవరి పొలాల వద్దకు వాళ్లు వెళ్తున్నామని చెబుతున్నారు. ఉదయం 6 గంటలకు బయలుదేరి చీకటి పడే వరకు అడవిలోనే గడుపుతామని అంటున్నారు. ఇలా చేయడం వల్ల గ్రామాలలో అంటురోగాలు గానీ, అరిష్టాలు గానీ జరగకుండా ఉంటాయని ఇక్కడి గ్రామస్తులు నమ్ముతున్నారు.
ఊర్లోని జనాభా మాత్రమే కాదు వారి పెంపుడు జంతువులు, గొడ్డుగోదా అంతటినీ తమతో తరలించుకుపోయారు. ఊర్లో ఒక్క ప్రాణి కూడా లేదు. అడవిలోనే వంటావార్పూ చేసుకున్నారు. ఆడిపాడి అలసిపోయి సాయంత్రానికి ఊరికి తిరిగివచ్చారు. అయితే, వరుస మరణాలకు కారణమేంటో తెలియడంలేదని గ్రామస్తుల వాపోతున్నారు.
Also Read:
శ్రీకాకుళం జిల్లాలో యువకుడికి చిక్కిన వింత చేప.. దాని పేరు కూడా మత్సకారులకు తెలియదట..!
Pangolin smuggling: మంచిర్యాల జిల్లాలో అలుగును పట్టారు.. కోటిన్నరకు బేరం పెట్టారు.. చివరకు