Sand-Meal: అన్నం వద్దు ఇసుక ముద్దు అంటున్న బామ్మ.. గత 60ఏళ్లుగా ఇసుకే భోజనం.. రోజుకి ఎంత తింటుందో తెలిస్తే షాక్..

|

Nov 27, 2021 | 3:45 PM

Sand Eating Woman: తినే ఆహారపదార్ధంలో కొంచెం ఇసుక వస్తేనే తినేదానిని పక్కకు పెట్టి.. వండివారిమీద ఓ రేంజ్ లో కోపగిస్తాం.. ఐటీ ఓ బామ్మ మాత్రం ఇసుకని పంటి కింద పెట్టుకుని పంచదార..

Sand-Meal: అన్నం వద్దు ఇసుక ముద్దు అంటున్న బామ్మ.. గత 60ఏళ్లుగా ఇసుకే భోజనం.. రోజుకి ఎంత తింటుందో తెలిస్తే షాక్..
Sand Eating Women
Follow us on

Sand Eating Woman: తినే ఆహారపదార్ధంలో కొంచెం ఇసుక వస్తేనే తినేదానిని పక్కకు పెట్టి.. వండివారిమీద ఓ రేంజ్ లో కోపగిస్తాం.. ఐటీ ఓ బామ్మ మాత్రం ఇసుకని పంటి కింద పెట్టుకుని పంచదార తిన్నట్లు ఇష్టంగా తినేస్తుంది. అది రోజుకి కిలోలు కిలోలు తింటూ అందరికి షాక్ ఇస్తుంది. ఈ బామ్మ.. అంతేకాదు ఇలా గత కొన్నేళ్లుగా ఇసుకనే ఆహారంగా తింటున్న అని చెబుతుంది ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వృద్ధురాలు కుష్మావతి దేవి. ఏమిటి ఇసుకని అన్నం తిన్నట్లు తింటుందా అని ఆశ్చర్యపోకండి..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసికి చెందిన వృద్ధురాలు కుష్మావతి దేవి రోజూ ఇసుకనే ఆహారంగా తీసుకుంటుంది. ఇలా గత 60 ఏళ్లుగా ఇసుకనే ఆహారంగా తీసుకుంటునట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ బామ్మ రోజుకి రెండు కిలోల ఇసుకని తింటుంది. అయినప్పటికీ ఆరోగ్యంగా ఉంది. ఇదే విషయం ఆ బామ్మని అడిగితె.. బోసినోరుతో చిరునవ్వు నవ్వుతు.. అసలు నేను ఏ రోగం లేకుండా ఇలా ఆరోగ్యంగా ఉన్నానంటే దానికి కారణం.. ఇసుక అంటుంది. ఇసుక తినడమే.. నా ఆరోగ్య రహస్యం అంటూ చెబుతుంది. ఈ వింత ఆహారపు అలవాటు తెలిసినవారు షాక్ తింటున్నారు. అయితే తనకు ఇలా ఇసుకని ఆహారంగా తీసుకునే అలవాటు డాక్టర్లు చెప్పిన సలహాతో వచ్చిందని చెబుతుంది బామ్మ.

కుష్మావతి దేవి టీనేజ్ లో ఉండగా.. భరించలేని కడుపునొప్పి వస్తే.. వైద్యులు కొంచెం బూడిద తినమని చెప్పారట. అప్పుడు కొంచెం బూడిద తినడం మొదలు పెట్టి.. తర్వాత ఇసుకని తినడం మొదలు పెట్టిందట.. అప్పుడు మొదలైన ఈ ఇసుకని తినే అలవాటు ఇప్పటికీ మానలేదు. కుష్మావతి టిఫిన్ తినడం లెట్ అయినా ఫీల్ అవదు కానీ.. ఇసుకని మాత్రం రోజుకి మూడుపూటలా సంతృప్తిగా తింటుంది. అయితే ఇసుకని తినే ముందు.. దానిని శుభ్రం చేసుకుని.. నీటిలో కడిగి అప్పుడు తింటుందట.

అయితే బామ్మగారి ఇసుక అలవాటుని మాన్పించడానికి ఫ్యామిలీ మొత్తం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇద్దరు కుమారులు.. వారి పిల్లలు కలిసి ఎంత చెప్పినా చివరికి డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళదామని అన్నా కుష్మావతి తన ఇసుకని తినే అలవాటుని మాత్రం విడిచి పెట్టలేదు. అస్తమాను ఫ్యామిలీ తనను ఇసుక తినవద్దు అంటుందని.. ఏకంగా కొడుకులను, మనవళ్లను వదిలి వేరే ఇంటికి వెళ్ళిపోయింది. కుటుంబానికి దూరంగా ఒకటిగా నివసిస్తుంది, 75 ఏళ్ళు దాటిన ఈ బామ్మ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా తనపనులు తాను చేసుకోవడమే కాదు.. పొలం పనులు కూడా చేస్తుంది. అయితే బామ్మ ఇలా ఇసుక తినడానికి కారణం ఐరెన్ లోపం అయి ఉండవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. మొత్తానికి తన స్పెషల్ మెనూతో ఈ బామ్మ హాట్ హాట్ టాపిక్ గా మారింది.

Also Read:  పానీ పూరీ అమ్ముతున్న రోబో.. స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఢిల్లీకి చెందిన వ్యక్తి..