World’s Widest Wig: ఇది విగ్గే.. కాకపోతే కాస్త పె..ద్ద..ది! గిన్నీస్‌ రికార్డు బ్రేక్‌ చేసిన మహిళ..

జుట్టున్నమ్మ ఏ కొప్పైనా పెడుతుంది అనేది పాత సామెత. మరి జుట్టులేకపోతేనో.. ఏముంది ఏ విగ్గో పెట్టుకుని మురిసిపోతారు. సాధారణంగా విగ్గులు గోరంతలను కొండంతలుగా చూపిస్తాయి. తలనిండా ఒత్తైన జుట్టుతో ఏ హెయిర్‌ స్టైల్ కావాలన్నా క్షణాల్లో చేసుకోవచ్చు. దీంతో లుక్‌ కూడా మారిపోతుంది..

World's Widest Wig: ఇది విగ్గే.. కాకపోతే కాస్త పె..ద్ద..ది! గిన్నీస్‌ రికార్డు బ్రేక్‌ చేసిన మహిళ..
World's Widest Wig
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 06, 2023 | 8:20 AM

జుట్టున్నమ్మ ఏ కొప్పైనా పెడుతుంది అనేది పాత సామెత. మరి జుట్టులేకపోతేనో.. ఏముంది ఏ విగ్గో పెట్టుకుని మురిసిపోతారు. సాధారణంగా విగ్గులు గోరంతలను కొండంతలుగా చూపిస్తాయి. తలనిండా ఒత్తైన జుట్టుతో ఏ హెయిర్‌ స్టైల్ కావాలన్నా క్షణాల్లో చేసుకోవచ్చు. దీంతో లుక్‌ కూడా మారిపోతుంది. ఐతే ఏ దేశంలోనైనా విగ్గులు మహా అయితే తలకు సరిపోయేలా పొడవుగానో, పొట్టిగానో ఉంటాయి. ఐతే ఓ మహిళ ప్రపంచంలోనే అత్యంత పెద్ద విగ్గును తయారు చేసింది. ఏ తలకు పెడుతుందో తెలీదుగానీ అంత పెద్ద విగ్గును తయారు చేయడమే కాదు తనే దాన్ని అలంకరించుకుని భారీ ప్రదర్శన కూడా ఇచ్చింది. ఇంకేముంది గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు వాళ్లు కూడా సదరు భారీ విగ్గు వైపు లుక్కేసుకున్నారు. ఫిదా అయ్యి అవార్డు ప్రధానం చేశారు. ఇంతకీ ఎక్కడ జరిగిందంటే..

2017లో అమెరికా తార డ్రూ బ్యారీమోర్ ఓ టీవీ కార్యక్రమంలో 7 అడుగుల 4 అంగుళాల వెడల్పు గల విగ్గు ధరించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఈ విగ్గును నిపుణులైన కెల్లీ హాన్సన్‌, రాండీ కార్ఫాగ్నోలు తయారుచేశారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న ఆస్ట్రేలియాకు చెందిన డానీ రెనాల్డ్స్ తాను కూడా అంతకంటే పెద్ద విగ్గు తయారుచేసి ధరించాలనుకుంది. స్వతహాగా డిజైనర్ అయిన డానీ విగ్గు డిజైన్‌ కోసం డ్రూ ధరించిన విగ్గునే స్ఫూర్తిగా తీసుకుంది. అందుకు రెండు నెలలు కష్టపడి 8 అడుగుల 6 అంగుళాల విగ్గు తయారు చేసింది. ఇందుకోసం దాదాపు నాలుగు వేల ఆస్ట్రేలియా డాలర్లు (మన కరెన్సీలో సుమారు 2.20 లక్షలు) ఖర్చు పెట్టింది. ఇంతకష్టపడి తయారు చేసిన విగ్గును అంతే స్థాయిలో ప్రచారం కల్పించాలనుకుంది. అందుకు అడిలైడ్‌లోనే అతి పెద్ద గ్యాలరీ అయిన ‘ఏస్‌ గ్యాలరీ’లో తాజాగా జరిగిన ఓ ఎగ్జిబిషన్‌లో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధుల ముందు దీనిని ధరించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వారు ఇటీవలే తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం డానీ ప్రతిభ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.