Are Lizards Really Afraid : చాలా ఇళ్లలో బల్లులు గోడలపై పాకుతూ ఇబ్బంది కలిగిస్తుంటాయి. ప్రజలు వీటిని బయటికి తరమడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అయితే దీనికి సరైన పరిష్కారం నెమలి ఈకలు. ఇంట్లో నెమలి ఈకలు ఉండటం వల్ల బల్లులు ఇంట్లో ఉండవని నమ్ముతారు. అంతేకాదు వాటిని చూస్తే అవి పారిపోతాయని చెబుతారు. కొంతమంది మాత్రం బల్లులను ఇంటి నుంచి పంపించడానికి మందులను ప్రయోగిస్తారు. అయితే నెమలి ఈకలు ఉంచడం వల్ల బల్లులు ఎందుకు దూరంగా ఉంటాయి. నెమలి ఈక వల్ల ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.. దీని వెనుక ఉన్న కారణం చాలా మందికి తెలియదు.
బల్లులు నెమలి ఈకలకు భయపడటానికి కారణం నెమలి పైభాగంలో ఉన్న డిజైన్. ఇది మెరుస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. బల్లి దీనిని పెద్ద జంతువు కన్నుగా భావిస్తుందని, దీని కారణంగా బల్లి భయపడుతుందని కొంతమంది నమ్ముతారు. అందుకే నెమలికి ఈకల దగ్గరకు రాదని చెబుతారు. నెమలి ఈకల నుంచి వచ్చే వాసన కారణంగా బల్లులు దాని నుంచి దూరంగా ఉంటాయని మరికొంతమంది నమ్ముతారు. ఇది కాకుండా నెమళ్ళు బహిరంగంగా ఉన్నప్పుడు బల్లులను తింటాయని, అందుకే చాలా కీటకాలు నెమళ్ళకు దూరంగా ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ కారణంగా నెమలి ఈకలను చూసిన బల్లులు కూడా భయపడతాయని చెబుతున్నారు.
అయితే ఈ కారణాలు నిజమని శాస్త్రీయంగా నిరూపించబడలేదు. చాలా నివేదికలు ఈ వాదనలను ఖండించాయి. బల్లులు నెమళ్ళకు భయపడుతున్నాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెబుతారు. యూట్యూబ్‌లలో కనిపించే వీడియోలలో బల్లి నెమలి ఈకల దగ్గర చాలాసేపు తిరుగుతూ ఉంటుంది అంతేకాదు దాని పైన కూర్చుంటుంది. అటువంటి పరిస్థితిలో నెమలి ఈకలు ఇంట్లో ఉంచితే బల్లులు పారిపోతాయనడం నమ్మలేం.