Breaking News
  • హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పూజ ప్రారంభం. 66 వ సంవత్సరం మహావిష్ణువు రూపంలో దర్శానమివ్వనున్న ఖైరతాబాద్ గణనాధుడు. శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతి గా నామకరణం. ఒక వైపు లక్ష్మిదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు. పర్యావరణ హితంగా ఖైరతాబాద్ గణ నాధుడు. మట్టితో తయారు చేసి అదే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఏర్పాటు. ఈ సారి 9 అడుగుల ఎత్తులో దర్శన మివ్వనున్న ఖైరతాబాద్ గణపతి. భక్తులు ఎవ్వరు రావద్దు ఆన్ లైన్ ద్వారా దర్శనము చేసుకోగలరని విజ్ఞప్తి చేసిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ.
  • విజయవాడ: ఏపీ స్టేట్ ఎలక్షన్ కమీషన్. ఎలక్షన్ కమీషనర్ కార్యాలయంలో వాస్తు మార్పులు అన్న వార్తలు అవాస్తవం. ఎటువంటి నమ్మకాలకు తావులేని వ్యక్తి ఎలక్షన్ కమీషనర్. ఆయన లేని సమయంలో కార్యాలయంలో కొన్ని మార్పులు జరిగాయి. కార్యాలయంలో మార్పులను ఎవరు నిర్ధారించారో విచారణ జరుగుతోంది.
  • తిరుపతి...పేరూరు వకుళామాత ఆలయంలో చారిత్రాత్మిక శాసనం లభ్యం. 1101 వ శతాబ్దం కిచేందిన శాసనంగా గుర్తించిన పురావస్తు శాఖ అధికారులు. విష్ణు మూర్తి అలయంతో పాటు, అమ్మవారి ఆలయం ఉన్నట్టు చెప్తున్న శాసనం. టిటిడి ఇప్పటివరకు వకుళామాత ఆలయానికి సంభందించి ఎప్పుడు దొరకనట్టువంటి చారిత్రక ఆధారాలు.. తొలిసారిగా శాసనం బయటపడినా దానిపై పూర్తి సమాచారం సేకరిస్తున్న పురవస్తూశాఖ అధికారులు.
  • పేరూరు వకులమాత ఆలయంలో దొరికిన1101 శతాబ్దపు శాసనాలను పరిరక్షిస్తున్న అధికారులు. బండరాళ్లపై శాసనం ఉండటంతో దాని చుట్టూ కాంక్రీట్ దిమ్మను నిర్మిస్తున్న అధికారులు. వందల ఏళ్ల తర్వాత అమ్మవారి ఆలయానికి సంబంధించి దొరికి న శాసనం.
  • నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం : 554.60 అడుగులు. ఇన్ ఫ్లో : 40,150 క్యూసెక్కులు. అవుట్ ఫ్లో : 2200 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ : 215.5430 టీఎంసీలు.
  • కాంగ్రెస్ సీనియర్ నేత మహారాష్ట్ర మాజీ సిఎం శివాజీరావు పాటిల్ నీలంగేకర్ పూణేలో కన్నుమూశారు.
  • చెన్నై విమానాశ్రయం లో భారీ గా పట్టుబడ్డ బంగారం , ఇద్దరు అరెస్ట్ . దుబాయ్ - షార్జా నుండి చెన్నై అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించినచిన కస్టమ్స్ అధికారులు . పట్టుబడ్డ 1 .48 కేజీల బంగారం విలువ 82 లక్షలు . చెన్నై కి చెందిన ఖలీల్ అహమద్ ,కాజా మొయిద్దీన్ అరెస్ట్ విచారణ చేపట్టిన కస్టమ్స్ అధికారులు.

నిర్భయ: పవన్​ క్యురేటివ్​ పిటిషన్​పై నేడు సుప్రీం విచారణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నాలుగో దోషి పవన్​ గుప్తా క్యురేటివ్​ పిటిషన్​పై నేడు విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. ఇంకా దోషుల పిటిషన్లు పెండింగ్​లో ఉన్నందున మార్చి 3న ఉరి అమలుపై ...
SC to consider curative plea of death row convict Pawan Gupta today, నిర్భయ: పవన్​ క్యురేటివ్​ పిటిషన్​పై నేడు సుప్రీం విచారణ

నిర్భయ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నాలుగో దోషి పవన్​ గుప్తా క్యురేటివ్​ పిటిషన్​పై నేడు విచారణ చేపట్టనుంది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు. ఇంకా దోషుల పిటిషన్లు పెండింగ్​లో ఉన్నందున మార్చి 3న ఉరి అమలుపై సందిగ్ధం నెలకొంది.

నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్ కుమార్ గుప్తా క్యురేటివ్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించనుంది.తనకు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరుతూ పవన్‌ కుమార్‌ గుప్తా పిటిషన్ దాఖలు చేశాడు. అటు డెత్ వారెంట్ల అమలుపై స్టే కోరుతూ పవన్ కుమార్‌తో సహా మరో దోషి అక్షయ్ సింగ్ శనివారం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తిహార్ జైలు అధికారులకు ట్రయల్ కోర్టు నోటీసు జారీచేసింది. సోమవారం నాటికి తమ స్పందన తెలియజేయాలని అధికారులను ఆదేశించింది.

నిర్భయ దోషులు ముకేశ్​, వినయ్​, అక్షయ్​ ఇదివరకే క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయగా రాష్ట్రపతి తిరస్కరించారు. దీనిని సవాలుచేస్తూ ముకేశ్​, వినయ్​లు సుప్రీం కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని కొట్టివేసింది అత్యున్నత న్యాయస్థానం. వీరిరువురూ తమ న్యాయపరమైన అవకాశాలన్నీ వినియోగించుకున్నారు. ఇంకా అక్షయ్​కు క్షమాభిక్ష పిటిషన్​ తిరస్కరణను సవాల్​ చేసే అవకాశముంది. పవన్​ గుప్తా ఇంకా క్షమాభిక్ష పిటిషన్​ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో మార్చి 3న నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలుపై అయితే మరోసారి సందిగ్ధం నెలకొంది.

Related Tags