మళ్లీ తెరపైకి నటి ప్రత్యూష మృతి కేసు

Prathyusha's mysterious death, మళ్లీ తెరపైకి నటి ప్రత్యూష మృతి కేసు

నటి ప్రత్యూష మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్ సిద్దార్థ్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ న్యాయస్థానం శిక్షను ఖరారు చేయగా.. తాజాగా తన శిక్షను తగ్గించాలంటూ అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యూష తల్లి సరోజిని, సిద్దార్థ్‌కు శిక్ష తగ్గించొందంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసును నిర్భయచట్టం కిందకు తీసుకురావాలని ఆమె విఙ్ఞప్తి చేశారు. కాగా ‘రాయుడు’ చిత్రం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించిన ప్రత్యూష.. ఆ తరువాత పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. 2002 ఫిబ్రవరి 23వ తేదిన ఆమె మరణించింది. అయితే ఇప్పటికీ ప్రత్యూషది హత్యా..? ఆత్మహత్యా..? అన్నది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *