దేశంలో ‘స్ట్రెయిన్’ వైరస్ కలవరం.. ఆ రాష్ట్రంలో మళ్లీ నైట్ కర్ఫ్యూ విధింపు.. ఎప్పటివరకూ అంటే.!
New COVID-19 Strain: బ్రిటన్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్(New Covid 19 Strain More Contagious) విజృంభన ఇండియాలో కలవరం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో

New COVID-19 Strain: బ్రిటన్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్(New Covid 19 Strain More Contagious) విజృంభన ఇండియాలో కలవరం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూను విధించారు. మంగళవారం నుంచి జనవరి 5వ తేదీ వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఈ మేరకు మహా సర్కార్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అలాగే యూరోప్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్ కంపల్సరీ చేశారు. (New Covid 19 Strain In UK)
అటు బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ కంట్రోల్ తప్పడంతో కేంద్రం అప్రమత్తమయ్యింది. యూకే నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్‌లు తప్పనిసరి చేసింది. ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌లు చెల్లవని విమానయానశాఖ మంత్రి హర్దీప్‌పురి తెలిపారు. ఢిల్లీ , ముంబై , హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌ల్లో బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేస్తామని స్పష్టం చేశారు. (New Covid 19 Strain Symptoms)
Also Read: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. ఇకపై ఎంసీఏ రెండేళ్లే.. కీలక ఉత్తర్వులు జారీ..