ఏపీ విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై ఎంసీఏ రెండేళ్లే.. కీలక ఉత్తర్వులు జారీ..
ఏపీ విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(MCA) కోర్సు వ్యవధిని ఏడాది తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Good News To AP Students: ఏపీ విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(MCA) కోర్సు వ్యవధిని ఏడాది తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఎంసీఏ మూడేళ్ల కోర్సును రెండు సంవత్సరాలుగా కుదించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అందుకు సంబంధించిన కరికులంను రూపొందించాలంటూ వీసీలకు ఆదేశాలు ఇచ్చింది.
కాగా, గతంలో AICTE కూడా ఎంసీఏ కోర్సును రెండేళ్లకు తగ్గించిన సంగతి తెలిసిందే. ఇక నుంచి ఎంసీఏ మూడేళ్ల(6 సెమిస్టర్లు)కు బదులుగా రెండేళ్ల(4 సెమిస్టర్లు)లో పూర్తి చేస్తే పట్టా పొందవచ్చు. MCA కోర్సుకు ఆదరణ తగ్గిపోతుండటం వల్ల AICTE ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, ఎంసీఏ కోర్సు వ్యవధి కుదింపు ప్రతిపాదనకు గతేడాది యూజీసీ ఆమోదముద్ర వేసిన సంగతి విదితమే.
Also Read:
అడిలైడ్ వైఫల్యం.. రెండో టెస్టుకు టీమిండియాలో భారీ మార్పులు.. ఆ నలుగురిపై వేటు తప్పదు.!