Kerala Zika virus Cases: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో కేరళలో పెరుగుతున్న జికా వైరస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతిరోజూ కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా సోమవారం మరో ముగ్గురికి జికా వైరస్ సోకింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 51కి పెరిగినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ సోమవారం వెల్లడించారు. అయితే వారిలో 46 మంది వైరస్ నుంచి కోలుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు ఐదు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వీణా జర్జ్ పేర్కొన్నారు. జీకా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే కేసులు పెరుగుతున్న దృష్ట్యా జీకా వైరస్ పరీక్ష కేంద్రాల సంఖ్యను కేరళ ప్రభుత్వం పెంచింది.
జికా వైరస్ ఏడిస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. జికా వైరస్‌ను 1947లో కోతుల్లో మొదటిసారి గుర్తించారు. 1952లో ఉగాండాలో మనుషుల్లో గుర్తించారు. జికావైరస్ సోకిన వారికి జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాల నొప్పి, నీరసం లాంటి లక్షణాలు కనిస్తాయి. అయితే.. ఈ వైరస్ ప్రాణాంతకం కాకపోయినప్పటికీ.. ఇప్పటి వరకూ దీనికి మందు లేకపోవడం అంతటా ఆందోళన కలిగిస్తోంది. అయితే.. పిల్లలకు సోకితే ఈ వైరస్ వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
Also Read: