గర్భవతిని చేసి ఎస్కేప్ అయ్యాడు.. కానీ పెళ్లికి కొన్ని నిమిషాల ముందు ఇలా జరిగింది..
ప్రేమించానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు. శారీరకంగా లొంగ దీసుకుని గర్భవతిని చేశాడు.

ప్రేమించానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు. శారీరకంగా లొంగ దీసుకుని గర్భవతిని చేశాడు. అనంతరం ఆమె చావుకు కారణమయ్యాడు.. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మీరట్‌కు చెందిన రాహుల్ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమ, పెళ్లి పేరు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆమె గర్భవతిని అయిందని తెలిసి మొహం చాటేశాడు. దీంతో ఆ యువతి పెళ్లి చేసుకుంటావా లేదా అని ప్రశ్నించగా కోపోద్రిక్తుడయ్యాడు. ఐదు నెలల గర్భవతి అని చూడకుండా బలవంతంగా గర్భస్రావం అయ్యే మాత్రలు మింగించాడు. తీవ్ర వేదనతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు మీరట్లోని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో బాధితుల తల్లిదండ్రులు రాహుల్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాహుల్‌ను పట్టుకున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అమాయకురాలైన యువతిని పొట్టన బెట్టుకొని అక్కడ మరో యువతితో వివాహానికి రెడీ అవుతున్నాడు రాహుల్. సరిగ్గా కొన్నినిమిషాల ముందు పెళ్లి తంతు జరుగుతుందనగా పోలీసులు రంగప్రవేశం చేసి అసలు విషయాలు చెప్పి అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.



