Crime News: దారుణాతి దారుణం.. పోలీస్ ఎస్ఐ ఎగ్జామ్ రాసి వస్తున్న యువతిపై సామూహిక అత్యాచారం.. ఆపై..

Crime News: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న

Crime News: దారుణాతి దారుణం.. పోలీస్ ఎస్ఐ ఎగ్జామ్ రాసి వస్తున్న యువతిపై సామూహిక అత్యాచారం.. ఆపై..
Asult
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 25, 2021 | 6:24 AM

Crime News: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న యువతిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మథురలోని కోసికలన్ ప్రాంతానికి చెందిన ఓ యువతి.. ఆగ్రా లో జరిగిన పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరై తిరిగి వస్తుండగా కొందరు యువకులు కార్ లిఫ్ట్ ఇచ్చారు. వారిలో తెలిసిన యువకుడు ఉండటంతో యువతి కారు ఎక్కింది. అయితే, ఢిల్లీ జాతీయ రహదారిపై కారులో ప్రయాణిస్తున్న క్రమంలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాలపడ్డారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేహత్ శ్రీష్ చంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోసికలన్ ప్రాంతానికి చెందిన ఓ యువతి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ ద్వారా యువకుడితో స్నేహం చేస్తోంది. పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష రాయడానికి ఆ యువకుడు ఆమెను కారులో ఆగ్రాకు తీసుకెళ్లాడు. కారులో వెళ్లే సమయంలో యువకుడితో పాటు ఒక్కడే డ్రైవర్ ఉండగా, తిరుగు ప్రయాణంలో అతని మరో నలుగురు స్నేహితులు కారు ఎక్కారు. పరీక్ష రాసి ఆగ్రా నుంచి తిరిగి వస్తుండగా వారు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

మొదట దాడి చేసి.. యువతి కారులో కూర్చున్న కొద్దిసేపటికే నిందితులు ఆమెను వేధించడం ప్రారంభించారని ఎస్పీ దేహత్ శ్రీష్‌చంద్ర తెలిపారు. యువతి వారిని తోసేయగా.. దాడి చేశారు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం హైవే పక్కన వదిలేశారు. దారి గుండా వెళుతున్న వారు.. బాధితురాలిని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. కుటుంబ సభ్యులు యువతిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.

పోలీసులకు ఫిర్యాదు.. కుటుంబ సభ్యులు బాధిత యువతిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి నుంచి సోషల్ మీడియాలో తనతో స్నేహం చేసిన యువకుడి ఫోన్ నెంబర్‌ను తెలుసుకున్నారు. అతనికి సంబంధించి మిగతా విషయాలేవీ ఆమెకు తెలియదు.

Also Read:

Rashmi Gautam: ఒంపు సొంపులతో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ బ్యూటీ..

Aaradhya : ఐశ్వర్య ఆరాధ్య చేతిని వదిలేయి.. మరోసారి ట్రోలర్ల బారిన పడ్డ తల్లీకూతుళ్లు..

Shamna Kasim: కనువిందు చేసే అందంతో ఫాన్స్‌ని కట్టిపడేస్తున్న `ఢీ` పూర్ణ..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!