
వివరాల్లోకి వెళితే.. కర్కలకు చెందిన “సయ్యద్” దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకాలోని ఒక ప్రైవేట్ కాలేజ్‌లో చదువుతున్నాడు. సయ్యద్ ఒక వాలీబాల్ ప్లేయర్.. అయితే సయ్యద్ తన కాలేజ్‌లో చదువుతున్న ఓ అమ్మాయికి గత కొన్ని రోజులుగా అసభ్యకర మెసేజ్‌లు చేస్తూ.. లైంగికంగా వేధిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ విషయంలో కలుగచేసుకున్న కొందరు హిందూ సంఘాల కార్యకర్తలు సయ్యద్‌ను పట్టుకొని అతనిపై దాడి చేశారు. ఇదే క్రమంలో అతని ఫోన్ లాక్కొని చెక్ చేశారు. అతని ఫోన్‌లో ఉన్న వందలాది మంది అమ్మాయిల ఫొటోలు, అశ్లీల వీడియోలు చూసి కంగుతిన్నారు. అతని మందలాది మంది అమ్మాయికు మెసేజ్‌లు చేస్తూ వేధిస్తున్నట్టు గుర్తించారు. దీంతో సయ్యద్‌ను వెంటనే పోలీసులుకు అప్పగించారు. హిందూ సంఘాల ఫిర్యాదుతో బెల్తంగడి పోలీసులు సయ్యద్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా తనపై దాడి చేసిన హిందూ సంఘాల కార్యకర్తలపై సయ్యద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో చట్టాన్ని చేతులోకి తీసుకొని సయ్యద్‌పై దాడి చేసిన హిందూ సంఘాల కార్యకర్తలు ఉజిరేకు చెందిన మనోజ్, ప్రజ్వల్ గౌడపై కూడా బెల్తంగడి పోలీసులు కేసు నమోదు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…