DRDO Scientist Died: DRDO యువ సైంటిస్ట్‌ ఆత్మహత్య.. ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరుకెళ్లి ఘాతుకం

|

Dec 15, 2023 | 3:42 PM

హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌ (DRDO)లో ఉద్యోగం చేస్తున్న యంగ్‌ సైంటిస్ట్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరులో ఉన్న తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు శుక్రవారం (డిసెంబర్ 15) తెలిపారు. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరుకు చెందిన భరత్ (24) అనే వ్యక్తి ఇటీవల హైదరాబాద్‌లోని తెలంగాణలోని హైదరాబాద్‌లోనున్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో జూనియర్‌ సైంటిస్ట్‌గా..

DRDO Scientist Died: DRDO యువ సైంటిస్ట్‌ ఆత్మహత్య.. ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరుకెళ్లి ఘాతుకం
DRDO scientist died
Follow us on

మంగళూరు, డిసెంబర్‌ 15: హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌ (DRDO)లో ఉద్యోగం చేస్తున్న యంగ్‌ సైంటిస్ట్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరులో ఉన్న తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు శుక్రవారం (డిసెంబర్ 15) తెలిపారు. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరుకు చెందిన భరత్ (24) అనే వ్యక్తి ఇటీవల హైదరాబాద్‌లోని తెలంగాణలోని హైదరాబాద్‌లోనున్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో జూనియర్‌ సైంటిస్ట్‌గా ఉద్యోగంలో చేరాడు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ రెండు నెలల క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

అయితే అధికారులు అతని రాజీనామాను అంగీకరించలేదు. భరత్ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన వారం రోజుల తర్వాత దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరు తాలూకాలోని ఆర్యపు గ్రామానికి తిరిగి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన రాజీనామాకు డీఆర్‌డీఓ అధికారులు ఆమోదించకపోవడానికి సంబంధించిన కారణం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం డీఆర్‌డీఓ ప్రతినిధి నుంచి అతనికి ఫోన్‌ కాల్ వచ్చింది. అనంతరం రాత్రి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గురువారం ఉదయం లేచి చూడగా రమేష్‌ తన గదిలో విగత జీవిగా ఉరికి వేళాడుతూ కనిపించాడు. దీనిపై కుటుంబ సభ్యలు పుత్తూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇదే ఏడాది ఫిబ్రవరిలో మరో సైంటిస్ట్‌ సూసైడ్‌

ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో డీఆర్‌డీవో సైంటిస్ట్‌ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఈ ఘటనలో డీఆర్‌డీవో శాస్త్రవేత్త బి రమేష్‌ (38) హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మరణించాడు. రమేష్‌కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుల వల్ల తీవ్ర ఒత్తిడికు గురైన రమేష్‌ వాటిని తీర్చలేక మరణించినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు.. ఈనెంబర్‌కు కాల్‌ చేయండి

ఆత్మహత్య ఆలోచనలను కలిగిన వారు లేదా మీ స్నేహితులు లేదా తెలిసిన వారు ఎవరైనా ఆత్మహత్య ఆలోచనల్లో ఉన్నట్లు భావిస్తే స్నేహ ఫౌండేషన్ ఫోన్‌ నెంబర్‌ 04424640050 (24×7 అందుబాటులో ఉంది) లేదా iCall టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హెల్ప్‌లైన్ – 9152987821 కాల్‌ చేసి కౌన్సెలింగ్‌ పొందవచ్చు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.