Covid-19 Vaccine Certificate: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే లబ్దిదారులు కోవిన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుని వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అయితే టీకా తీసుకున్న తర్వాత సర్టిఫికేట్ కూడా ఆ యాప్ ద్వారానే పొందవచ్చు. అలాగే టీకాల సర్టిఫికేట్‌లోని లోపాలను కూడా సరిదిద్దుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది. కోవిన్ ప్లాట్‌ఫామ్‌కు రైజ్‌ఏ ఇష్యూ అనే ప్రత్యేక్ష ఆప్షన్‌ను పొందుపర్చినట్లు తెలిపింది. దీని ద్వారా సర్టిఫికేట్‌లో ఏవైనా లోపాలు ఉన్నా.. సరి చేసుకోవచ్చని తెలిపింది. టీకా తీసుకున్న వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, సంవత్సరం, లింగం వంటి వివరాలను కోవిన్ యాప్‌లో టీకా సర్టిఫికేట్‌కు సంబంధించి మార్పులు చేసుకోవచ్చు. అయితే ఏవైనా లోపాలు ఉంటే ఒక్కసారి మాత్రమే మార్పు చేసుకోవచ్చు. ఒకసారి లోపాలను సరి చేసిన తర్వాత మళ్లీ చేయాలంటే కుదరదు అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా సర్టిఫికేట్‌లో మీ పేరు, పుట్టిన సంవత్సరం, లింగం వంటి వివరాలు సరి చేసుకునే అవకాశం ఉంది. ఈ మార్పులను http://cowin.gov.in లింక్‌పై క్లిక్ చేసి సరి చేసుకోవచ్చని కేంద్రం ట్విట్టర్‌లో తెలిపింది. ఈ లింక్ ద్వారా వెళ్లి మీ 10 అంకెల మొబైల్ నెంబర్‌ను నమోదు చేసి సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. ఖాతా వివరాలకు వెళ్లి.. మీకు మీ మొదటి లేదా రెండో టీకా మోతాదు వివరాలు సరిదిద్దుకోవచ్చు. కాగా, దేశంలో ఇప్పటి వరకు 23,90,58,360 వ్యాక్సిన్‌లను అందించారు.
New citizen friendly feature on #CoWIN. Now correct the errors in vaccination certificate yourself @drharshvardhan @MoHFW_INDIA @PIB_India @PIBHindi https://t.co/cctzI8hTCD
— Vikas Sheel (@iamvikassheel) June 8, 2021
Home Auction: బ్యాంకు అదిరిపోయే ఆఫర్.. తక్కువ ధరకే ఇల్లు, ప్రాపర్టీ కొనే అవకాశం.. పూర్తి వివరాలు
Reserve Bank: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ రెండు బ్యాంకులకు భారీ జరిమానా.. కారణం ఏంటంటే..!