ఎన్నికలే లక్ష్యం..పుణ్య క్షేత్రాల్లో టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం

వచ్చే ఏడాది తమ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలోనుంచుకుని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముఖ్యంగా 'మతపరమైన టూరిజం' అభివృద్ధిపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో ఈ రంగాన్ని ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పరచి ప్రజలతో కనెక్ట్ కావాలని ఆయన...

ఎన్నికలే లక్ష్యం..పుణ్య క్షేత్రాల్లో టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం
Up Cm Yogi Adityanath Block Panchayat Elections

Edited By:

Updated on: Aug 14, 2021 | 8:52 PM

వచ్చే ఏడాది తమ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలోనుంచుకుని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముఖ్యంగా ‘మతపరమైన టూరిజం’ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో ఈ రంగాన్ని ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పరచి ప్రజలతో కనెక్ట్ కావాలని ఆయన నిర్ణయించారు. అయోధ్య, వారణాసి, మధుర, గోరఖ్ పూర్ వంటి పుణ్య క్షేత్రాలనే కాకుండా వింధ్యాచల్, చిత్రకూట్, శాకాంబరీ సిద్ది పీఠం లాంటి అనేక చోట్ల టూరిస్టులు, ప్రజలకు అనువైన సౌకర్యాలను పెంచాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీనివల్ల ప్రజలకు బీజేపీ త్వరగా కనెక్ట్ కాగలుతుందని ఆయన భావిస్తున్నారు. రెలిజియస్ టూరిస్టుల కోసం వీటిని పాపులర్ హబ్ లుగా మార్చాలని, దీని వల్ల అటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడడమే కాక, టూరిజం కారణంగా రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వీటి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా సెప్టెంబరు 30 నాటికి ఈ పనులన్నీ పూర్తి చేయాలని ఆయన డెడ్ లైన్ కూడా పెట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినట్టు తేలితే సహించబోమని కూడా యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.

విదేశాల నుంచి ఎక్కువ సంఖ్యలో టూరిస్టులు వారణాసి, మధుర, వంటి ప్రాంతాలకు వస్తుంటారు. ముఖ్యంగా వర్షాకాల సీజన్ లో తప్ప మిగిలిన అన్ని కాలాల్లోనూ ఈ పుణ్య క్షేత్రాలకు వీరి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా వారణాసిలో ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగే ‘గంగా హారతి’ కార్యక్రమం వారిని విశేషంగా ఆకరిష్తుంటుంది. అలాగే మధుర లోని బృందావన్ ను కూడా చూసేందుకు వారు చాలా ఇష్టపడుతుంటారు. ఈ కారణాల వల్లే యోగి ఆదిత్యనాథ్ ఈ చోట్ల సదుపాయాలు మెరుగు పరచాలని టూరిజం శాఖ అధికారులను ఆదేశించారు.

మరిన్ని ఇక్కడ చూడండి : బాయ్‌ఫ్రెండ్‌ కోసం..జుట్లు పీక్కుని కొట్టుకున్న అమ్మాయిలు..!ట్రెండ్ అవుతున్న వీడియో: Girls Hit For a Boyfriend Video.

 జోకర్‌ దొంగ..పోలీసులకే ఛాలెంజ్‌..!హాలీవుడ్ తరహాలో ఏటీఏం చోరీ వైరల్ వీడియో..:Joker Thief Video.

 గుప్త నిధులకోసం గుట్టపైకి వెళ్తే.. ఊహించని షాక్‌! గ్రామస్థులకు పట్టించిన చిన్న డౌట్..(వీడియో):Hidden Treasures Video.

 అంకల్‌తో యంగ్ లేడి రొమాన్స్ క్రేజీగా వస్తున్నా క్రేజీ అంకుల్స్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్..:Crazy Uncles Pre Release Video.