Presidential Elections 2022: 11 మంది నేతలతో ఉమ్మడి ప్రచార కమిటీ.. మంగళవారం నుంచి యశ్వంత్ సిన్హా ప్రచారం..

|

Jun 27, 2022 | 7:18 PM

ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ దాఖలు చేశారు. అంతటితో ఆగకుండా.. ఉమ్మడిగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రచార కమిటీ ఏర్పాటయింది. అందులో 11 మంది నేతలున్నారు. ప్రచార కమిటీలో టీఆర్ఎస్ తరఫున..

Presidential Elections 2022: 11 మంది నేతలతో ఉమ్మడి ప్రచార కమిటీ.. మంగళవారం నుంచి యశ్వంత్ సిన్హా ప్రచారం..
Minister Ktr With Yashwant
Follow us on

రాష్ట్రపతి ఎన్నికల్లో NDAను గట్టిగా ఢీ కొట్టాలని డిసైడ్‌ అయ్యాయి విపక్షాలు. ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ దాఖలు చేశారు. అంతటితో ఆగకుండా.. ఉమ్మడిగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రచార కమిటీ ఏర్పాటయింది. అందులో 11 మంది నేతలున్నారు. ప్రచార కమిటీలో టీఆర్ఎస్ తరఫున ఎంపీ రంజిత్‌ రెడ్డికి చోటు కల్పించారు. కాంగ్రెస్‌ నుంచి జైరాంరమేష్, సీపీఐ నుంచి డి.రాజా, సీపీఎం నుంచి సీతారాం ఏచూరి ఉన్నారు. ఇక, డీఎంకే నుంచి తిరుచ్చి శివ, తృణమూల్ నుంచి సుఖేందు రాయ్‌, సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాంగోపాల్‌ యాదవ్, NCP నుంచి ప్రఫుల్‌ పటేల్, RJD నుంచి మనోజ్‌ ఝా కు కమిటీలో చోటు కల్పించారు. వీళ్లంతా ఉమ్మడిగా యశ్వంత్‌ సిన్హాకు ఓటేయాలని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తారు. యశ్వంత్ సిన్హా అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత.. ఆయన దేశవ్యాప్త ప్రచారం కోసం ప్రచార కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు నామినేషన్ పత్రాల దాఖలు తర్వాత ప్రచారం కమిటీ వేశారు. యశ్వంత్ సిన్హా మంగళవారం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు..

రాష్ట్రపతి పదవికి విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈరోజు పార్లమెంట్ హౌస్‌కు చేరుకున్న తర్వాత నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట పలువురు విపక్ష నేతలు కూడా ఉన్నారు. రాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం యశ్వంత్ సిన్హా మీడియాతో మాట్లాడారు. నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసిన ప్రతిపక్షాలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. విపక్షాల నుంచి రాష్ట్రపతి పదవికి నేనే నాల్గో ఛాయిస్ అని చెప్పానని.. అయితే నేనే పదవి ఎంపిక అయినా సరే అంగీకరించేవాడినని చెప్పదలుచుకున్నానని యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు. ఎందుకంటే ఇది ఆలోచనల యుద్ధం, నేను దీనికి సహకరించాలనుకుంటున్నాను. 

రాష్ట్రపతి అభ్యర్థి అర్హత గురించి యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ ప్రభుత్వానికి సలహా ఇవ్వడమే రాష్ట్రపతి పని కాబట్టి సలహా ఇచ్చే వ్యక్తి రాష్ట్రపతిగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వానికి సలహాలిచ్చే ధైర్యం లేని వ్యక్తి రాష్ట్రపతి అయితే ఆ బాధ్యతలు నిర్వర్తించలేరన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను రబ్బర్ స్టాంప్‌గానే మిగిలిపోతానని గతంలో కూడా చూశామని యశ్వంత్ సిన్హా అన్నారు. 

జాతీయ వార్తల కోసం