తప్పుడు ఇంజెక్షన్ కారణంగా ఇంటర్ విద్యార్థిని దుర్మరణం పాలైంది. ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా 17ఏళ్ల యువతికి నిండు నూరెళ్లు నిండిపోయాయి. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో చోటు చేసుకుంది. బాలిక మరణించిన తర్వాత మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు బైక్‌పై ఉంచింది ఆస్పత్రి సిబ్బంది. ఆ బాలిక మృతదేహానికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో కలకలం రేగింది. తప్పుడు ఇంజెక్షన్ వల్లే బాలిక చనిపోయిందని ఆరోపించారు. అందువల్లే ఆసుపత్రి సిబ్బంది ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి బయట బైక్‌పై వదిలేశారని ఆందోళనకు దిగారు. జిల్లాలోని ఘీరోర్‌కు చెందిన గిరీష్ కుమార్తె 17 ఏళ్ల ఆరోగ్యం క్షీణించడంతో కర్హల్ రోడ్‌లోని రాధా స్వామి ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
సమాచారం ప్రకారం చనిపోయిన బాలిక12వ తరగతి చదువుతున్న భారతిగా తెలిసింది. మంగళవారం ఆమెకు తీవ్ర జ్వరం రావటంతో కుటుంబ సభ్యులు ఆమెను ఘిరోర్‌లోని రాధా స్వామి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స ప్రారంభించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పత్రిలో చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే భారతి మృతి చెందిందని, ఆస్పత్రి నిర్వాహకులు కుటుంబీకులకు సమాచారం ఇవ్వకుండా భారతిని బయటకు తీసుకెళ్లి ఆస్పత్రి ఆవరణలోని పార్కింగ్‌లో ఉన్న ఓ బండిపై వదిలేశారు. కుటుంబ సభ్యులకు కనిపించకుండా ఆస్పత్రి సిబ్బంది అక్కడ్నుంచి పరారయ్యారు. ఈ సంఘటన తర్వాత, ఒక వీడియో సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు చనిపోయిన భారతి మృతదేహాన్ని మోటార్‌సైకిల్‌పై వదిలి వెళ్లటం కనిపించింది.
In UP’s Mainpuri, a 17-year-old girl suffering from fever died allegedly after she was administered wrong injection at a private hospital. Her body was later abandoned outside hospital by the staff as the family tried to take it away on a motorcycle. pic.twitter.com/yhQtRcDdOF
— Piyush Rai (@Benarasiyaa) September 28, 2023
ఆ వీడియోలో, కొందరు వ్యక్తుల సంభాషణ కూడా రికార్డైంది. మరొకరు అయ్యో భారతి అంటూ విపరీతంగా ఏడుస్తున్నట్లుగా కూడా వినిపించింది. ఈ 58 సెకన్ల వీడియోలోని చివరి సన్నివేశంలో మహిళతో పాటు ఒక వ్యక్తి విద్యార్థి మృతదేహాన్ని బైక్‌పై నుండి తీయడం కనిపిస్తుంది. ఇంటర్‌నెట్‌లో వీడియో వైరల్‌గా మారటంతో..విషయంపై వివరణాత్మక విచారణ కోసం ఆసుపత్రి లైసెన్స్ సస్పెండ్ చేయబడింది. అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ (ACMO) ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంపై వారం రోజుల్లోగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ నుంచి నివేదిక కోరినట్లు తెలిపారు. ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..