‘ఆ రాష్ట్రాలకు వరల్డ్ బ్యాంక్ సహకారం ఉంటుంది’.. కిషన్ రెడ్డితో కంట్రీ డైరెక్టర్ వెల్లడి..

కిషన్ రెడ్డిని సోమవారం ప్రపంచ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ అగస్తే కువామే నేతృత్వంలోని అధికారుల బృందం కలిసింది. ఈ సందర్భంగా ప్రపంచబ్యాంకు ఆధ్వర్యంలో..

‘ఆ రాష్ట్రాలకు వరల్డ్ బ్యాంక్ సహకారం ఉంటుంది’.. కిషన్ రెడ్డితో కంట్రీ డైరెక్టర్ వెల్లడి..
Kishan Reddy And Auguste Kouame Meet

Updated on: Mar 14, 2023 | 9:21 PM

కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని సోమవారం ప్రపంచ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ అగస్తే కువామే నేతృత్వంలోని అధికారుల బృందం కలిసింది. ఈ సందర్భంగా ప్రపంచబ్యాంకు ఆధ్వర్యంలో నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో జరుగుతున్న సమగ్రాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరిగింది. అనంతరం మాట్లాడిన కిషన్ రెడ్డి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి వరల్డ్ బ్యాంకు ద్వారా జరుగుతున్న సహాయ కార్యక్రమాలను అభినందించారు. అలాగే ఇకపైనా కూడా వరల్డ్ బ్యాంక్ సహాయసేవలను కొనసాగించాలన్నారు. ఈ క్రమంలోనే  ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఈశాన్య రాష్ట్రాల పురోగతికోసం కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొల్పడంతోపాటు, అనుసంధానతకోసం జరుగుతున్న కృషిని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us