బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా మరోసారి వివాదంలో ఇరుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం ఇండోర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ నేత కైలాష్ విజయవర్గియా మాట్లాడుతూ అమ్మాయిల వస్త్రధారణ పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య అమ్మాయిలు చెత్త దుస్తులు ధరిస్తున్నారని అన్నారు. ఆడపిల్లలు వేసుకునే బట్టలను చూసిన తర్వాత వాళ్లను దేవతలుగా ఎన్నటికీ భావించలేము..వాళ్లలో నాకు దేవతామూర్తులు కనపడడం లేదు..శూర్పణఖలా కనపడతారు..అంటూ వర్గీయ వ్యాఖ్యానించారు.
మద్యం మత్తులో తూలుతూ చిందులేసి అమ్మాయిలు, అబ్బాయిలను చూసినపుడు వాళ్ల మత్తు దిగేలా వాళ్ల చెంపలపై చెళ్లుమని ఐదారుసార్లు కొట్టాలని అనిపిస్తుంటందని వర్గీయ చెప్పారు. భగవంతుడు వారికి అందమైన దేహాన్ని ఇచ్చాడు..కనీసం కొన్ని మంచి దుస్తులైనా వేసుకోవాలి అంటూ ఆయన హితవు పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
BJP Leader @KailashOnline says girls dress badly & look like ‘Shurpanakha’. This is a reprehensible & demeaning insult to every woman of this country
Where is @smritiirani now? Does she condone this disgusting statement? Or does she only find her voice to attack @RahulGandhi! pic.twitter.com/hzoxrnZpl1
— Dr. Shama Mohamed (@drshamamohd) April 8, 2023
కాగా..విజయ్ వర్గీయ వ్యాఖ్యలను మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఎటువంటి వస్త్రాలు ధరించాలో మహిళల ఇష్టమని, ఇందులో బిజెపి నాయకుల జోక్యమేంటని మహిళా సంఘాలు ప్రశ్నించాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం