Covid Vaccine: నాలుగు డోసులు తీసుకున్నా.. కరోనా మహమ్మారి సోకింది..! అక్కడినుంచి వచ్చిన మహిళకు..

|

Dec 30, 2021 | 5:34 PM

Covid-19 positive in Indore: కరోనా మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. అయితే.. వ్యాక్సిన్ తీసుకున్న వారికి

Covid Vaccine: నాలుగు డోసులు తీసుకున్నా.. కరోనా మహమ్మారి సోకింది..! అక్కడినుంచి వచ్చిన మహిళకు..
Corona
Follow us on

Covid-19 positive in Indore: కరోనా మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. అయితే.. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా వైరస్ సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై వైద్య నిపుణులు అంతకుముందే స్పందించారు. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను తీసుకున్నప్పటికీ వైరస్‌ సోకే అవకాశాలున్నాయని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగు డోసులు తీసుకున్న ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మధ్యప్రదేశ్‌లోని ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు సాధారణంగా చేపట్టిన కరోనా పరీక్షల్లో దుబాయ్‌కి చెందిన ఓ మహిళకు వైరస్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు.

ఇతర దేశాల్లో నాలుగు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ 30ఏళ్ల మహిళ ఇటీవల ఇండోర్‌ వచ్చిందని ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఎయిర్‌ పోర్ట్‌ అధికారులు తెలిపారు. దుబాయ్‌ నుంచి వచ్చిన మహిళకు ఎయిర్‌పోర్టు నిబంధనల ప్రకారం.. పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఆమెకు నాలుగు రోజుల క్రితం జలుబు, దగ్గు వచ్చినట్లు ఆ మహిళ పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం తీవ్ర లక్షణాలేమీ కనిపించలేదని.. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా స్థానిక ఆసుపత్రిలో చేర్పించినట్లు ఇండోర్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ భురే సింగ్‌ సెథియా తెలిపారు.

కాగా.. కరోనా బారిన పడిన మహిళ దుబాయ్‌ నుంచి 12 రోజుల క్రితం ఇండోర్‌కు చేరుకుంది. అనంతరం బంధువుల వివాహ కార్యక్రమంలో పాల్గొందని.. ఆ తర్వాత తిరిగి దుబాయ్‌ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆమె ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్యకాలంలో సినోఫామ్‌, ఫైజర్‌కు చెందిన టీకాలను రెండు డోసుల చొప్పున ఆమె టీకా తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

Also Read:

Corona Virus: ఆ దేశంలో జీరో కోవిడ్ పాలసీ.. నిబంధనలు ఉల్లంగిస్తే అవమాన పడేలా వీధుల్లో ఉరేగింపు సహా అనేక శిక్షలు..

Hindu Marriage: ఆంధ్రా అబ్బాయిలు..విదేశీ అమ్మాయిలు.. వేదమంత్రాలు..అగ్ని సాక్షిగా ఒక్కటైన జంటలు..