బెంగళూరు, నవంబర్ 16: ఐటీ రాజధాని బెంగళూరులో ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. రాత్రి వేళ కొందరు అంగతకులు మహిళా ఉద్యోగిపై వేధింపులకు దిగారు. తన భార్యకు ఎందురైన ఘటనను వివరిస్తూ ఆమె భర్త సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమె వారి నుంచి ఎలా తప్పించుకున్న విధానాన్ని కూడా చెప్పుకొచ్చాడు. అసలేం జరిగిందంటే.. బెంగళూరుకు చెందిన దంపతులు అక్కడే వేరువేరు కంపెనీల్లో ఉద్యోగం చేసుకుంటున్నారు. అయితే గత గురువారం (నవంబర్ 8) రాత్రి 10 గంటల సమయంలో ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన మహిళకు క్యాబ్ దొరకకపోవడంతో, తన సహోదోగ్యుల కారులో ఆమె ఇంటికి బయల్దేరింది. అయితే తమ ఇంటికి వెళ్లేలోపు మార్గం మధ్యలో సర్జాపూర్‌లో కొందరు పోకిరీలు వారి కారును మరో వాహనంలో వెంబడించారు. అలా ఆమె కారును చాలా దూరం వెంబడించారు.
ఈ క్రమంలో పలుమార్లు ఆమె కారును కూడా ఢీకొట్టారు. కారును ఆపాలంటూ భీభత్సం సృష్టించారు. ఇంతలో ఆమె తెలివిగా కారును రోడ్డుమధ్యలో ఆపు చేసింది. దగ్గరకు వచ్చిన దుండగులు ఆమెను, ఆమె తోటి ఉద్యోగులను కారు నుంచి దిగాలని ఒత్తిడి చేశారు. కారులో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరికి సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే వారి బెదిరింపులను లెక్క చేయకుండా కారులోనే ఉన్న మహిళ పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే లొకేషన్‌కు రావాలని భర్తతోపాటు 10 మంది స్నేహితులకు సమాచారం అందించింది. వారు సమయానికి రాకుండా ఉండిఉంటే ఈ వ్యవహారం వేరే మలుపు తిరిగి ఉండేది. ఇంతలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను గమనించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
I’ve never felt unsafe in Bangalore – I know my privilege of being a Kannada speaking male – but last Thursday night I felt how unsafe certain parts of the city are post 10pm.
I’ve seen those horrific videos of fake accidents in Sarjapur where hooligans have tried to blackmail… pic.twitter.com/lwHK8dymZM
— Srijan R Shetty (@srijanshetty) November 14, 2023
తన భార్యను వేధించడంపై శెట్టి అనే అతను ఎక్స్‌లో పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులోని సర్జాపూర్ ఇలాంటి దాడులకు హాట్ స్పాట్‌గా మారిందని తన పోస్టులో శెట్టి ఆవేధన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే 4-5 చోటుచేసుకున్నాయని అన్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో భర్త పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. బెంగళూరులో తాము ఎదుర్కొన్న సంఘటనలను కొందరు నెటిజన్లు పంచుకున్నారు. నేరస్థులు తరచూ వాహనదారులను దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.