జమ్ముకశ్మీర్‌లో విజృంభించిన చలిపులి.. మరో నెల రోజులు ఇంతే.!

జమ్ముకశ్మీర్‌లో చలిపులి మరింత విజృంభించింది. రాజధాని శ్రీనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీనగర్‌లో మైనస్‌ 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాల్‌లేక్‌ పూర్తిగా మంచుతో గడ్డకట్టిపోయింది. 

జమ్ముకశ్మీర్‌లో విజృంభించిన చలిపులి.. మరో నెల రోజులు ఇంతే.!
Jammu

Updated on: Jan 04, 2024 | 1:38 PM

జమ్ముకశ్మీర్‌లో చలిపులి మరింత విజృంభించింది. రాజధాని శ్రీనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీనగర్‌లో మైనస్‌ 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాల్‌లేక్‌ పూర్తిగా మంచుతో గడ్డకట్టిపోయింది.

సోన్‌మార్గ్‌,గుల్‌మార్గ్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. శీతల పవనాల తీవ్రత మరింత పెరగడంతో అధికారులు అలర్ట్‌ ప్రకటించారు. జనవరి 29వ తేదీ వరకు కశ్మీర్‌లో వింటర్‌ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ వెల్లడించింది. చలితీవ్రత పెరగడంతో కశ్మీర్‌లో కరెంట్‌ , మంచినీటి సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. గత డిసెంబర్‌ లోనే కశ్మీర్‌లో మంచు కురవాలి. కాని మంచు కురవకపోవడంతో మంచినీటికి కొరత ఏర్పడింది.