Cold wave: దేశాన్ని గజగజలాడిస్తోన్న చలి గాలులు.. నెటిజన్లను కితకితలు పెట్టిస్తోన్న మీమ్స్‌..

|

Jan 09, 2023 | 11:49 AM

దేశాన్ని చలి గజ గజ వణికిస్తోంది. దేశవ్యాప్తంగా చలి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఢిల్లీ మొదలు తెలుగు రాష్ట్రాల వరకు ప్రజలు చలికి వణికిపోతున్నారు. పగటి పూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది..వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది...

Cold wave: దేశాన్ని గజగజలాడిస్తోన్న చలి గాలులు.. నెటిజన్లను కితకితలు పెట్టిస్తోన్న మీమ్స్‌..
Cold Wave In India
Follow us on

దేశాన్ని చలి గజ గజ వణికిస్తోంది. దేశవ్యాప్తంగా చలి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఢిల్లీ మొదలు తెలుగు రాష్ట్రాల వరకు ప్రజలు చలికి వణికిపోతున్నారు. పగటి పూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది..వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. చిన్నపిల్లలు.. వృద్ధులు.. శ్వాసకోశ సంబంధిత సమస్యలున్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. చలి తీవ్రత ధాటికి ఢిల్లీ, జార్ఖండ్‌లో స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. ఢిల్లీలో 1.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు ప్రజలు.

ఇక దక్షిణాదిలోనూ చలి పులి చంపేస్తోంది. చెన్నైలో అనూహ్యంగా పడిపోయాయి ఉష్ణోగ్రతలు..చెన్నై ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మరికొన్ని విమానాలు రద్దయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోను చలి తీవ్రత పెరిగింది. ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్, గ్రేటర్‌లో మూడురోజుల వరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు..ఈశాన్య గాలులతో చలి తీవ్రత పెరుగుతుంది. అల్లూరిజిల్లా ఏజెన్సీలో చలి పంజా విసురుతోంది. అరకు తదితర ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బెజవాడలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. టెంపరేచర్‌ డౌన్‌ అయ్యేకొద్ది పొగమంచు గడ్డ కట్టి వాహనాలపై గాజులా పేరుకుపోతోంది. రాయలసీమలోను ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురంలో పొగ మంచుతో ముందున్న వాహనాలు కనపడటం లేదు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్‌ అవుతోన్న మీమ్స్‌..

ఓవైపు చలి పులి ప్రజలను గజగజలాడిస్తుంటే మరోవైపు నెట్టింట వైరల్‌ అవుతోన్న మీమ్స్‌ ప్రజలను కితకితలు పెట్టిస్తున్నాయి. చలి తీవ్రతను కూడా తమ ట్యాలెంట్‌కు ముడి సరుకుగా వాడుకున్నారు మీమర్స్‌. ముఖ్యంగా ఢిల్లీ వాతావరణాన్ని నేపథ్యంగా రకరకాల మీమ్స్‌ను క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఈ మీమ్స్‌ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. తమ ప్రతిభతో నెటిజన్లు మెస్మరైజ్‌ చేస్తున్నారు. అలా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న కొన్ని మీమ్స్‌పై ఓ లుక్కేయండి…

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..