మేం అధికారంలోకి వస్తే రైతు చట్టాలను రద్దు చేస్తాం, రాహుల్ గాంధీ

తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రైతు చట్టాలను రద్దు చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ కరోనా వైరస్ కాలంలో ఇంత హడావుడిగా కేంద్రం ఈ చట్టాలను తేవలసిన అవసరం ఏముందన్నారు. ఆదివారం పంజాబ్ లో..

మేం అధికారంలోకి వస్తే రైతు చట్టాలను రద్దు చేస్తాం, రాహుల్ గాంధీ
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 04, 2020 | 7:53 PM

తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రైతు చట్టాలను రద్దు చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ కరోనా వైరస్ కాలంలో ఇంత హడావుడిగా కేంద్రం ఈ చట్టాలను తేవలసిన అవసరం ఏముందన్నారు. ఆదివారం పంజాబ్ లోని మోగాలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న ఆయన, ఈ చట్టాలపట్ల అన్నదాతలు సంతోషంగా ఉంటే మరి వారెందుకు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారని ప్రశ్నించారు. అటు-బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్.. ఈ నిరంకుశ చట్టాలను కేంద్రం రద్దు చేసేంతవరకు తాము విశ్రమించబోమన్నారు. వీటిని తక్షణమే రద్దు చేయాలని, లేదా రైతుల ప్రయోజనాలకు అనువుగా వీటికి సవరణలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో మూడు రోజులపాటు ఈ నిరసన ర్యాలీలు, సభలు జరగనున్నాయి.