ఝార్ఖండ్ తదుపరి సీఎం హేమంత్ సొరేన్ ?
ఝార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ సీఎం హేమంత్ సొరేన్ పైనే మీడియా ఫోకస్ చేసింది. (చాలా వరకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఈయనే అవుతారని ఎగ్జిట్ పోల్ ఇదివరకే అంచనా వేసింది). ఈ ఎన్నికల్లో డుంకా, బార్హెట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న హేమంత్ మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్ఛునన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. బీజేపీ నేత, ప్రస్తుత సీఎం రఘువర దాస్ సక్సెసర్ గా ఆయన తిరిగి అధికారపగ్గాలు అందుకోవచ్ఛునని నిపుణులు భావిస్తున్నారు. హేమంత్ ఆధ్వర్యంలోని జేఏంఎం […]
ఝార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ సీఎం హేమంత్ సొరేన్ పైనే మీడియా ఫోకస్ చేసింది. (చాలా వరకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఈయనే అవుతారని ఎగ్జిట్ పోల్ ఇదివరకే అంచనా వేసింది). ఈ ఎన్నికల్లో డుంకా, బార్హెట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న హేమంత్ మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్ఛునన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. బీజేపీ నేత, ప్రస్తుత సీఎం రఘువర దాస్ సక్సెసర్ గా ఆయన తిరిగి అధికారపగ్గాలు అందుకోవచ్ఛునని నిపుణులు భావిస్తున్నారు.
హేమంత్ ఆధ్వర్యంలోని జేఏంఎం గత మార్చిలోనే కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటలవరకు అందిన ఫలితాలను బట్టి చూస్తే.. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీలకు ఈ ట్రెండ్ అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. మాజీ సీఎం శిబు సొరేన్ కుమారుడైన హేమంత్ సొరేన్.. డుంకా నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నప్పటికీ.. బార్హెట్ సెగ్మెంట్ లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక జంషెడ్పూర్ ఈస్ట్ నియోజకవర్గంలో ప్రస్తుత సీఎం, బీజేపీ నేత రఘువర్ దాస్.. స్వతంత్ర అభ్యర్థి సరయు రాయ్ కన్నా 4,643 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. ఒకప్పుడు రఘువర్ దాస్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న రాయ్.. ని బీజేపీ బహిష్కరించడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలోకి దిగారు. అటు-మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ ధన్వార్ నియోజకవర్గంలో 18 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
#WATCH: Jharkhand Mukti Morcha's (JMM) Hemant Soren rides a cycle at his residence in Ranchi. JMM is currently leading on 28 seats while the Congress-JMM-RJD alliance is leading on 46 seats. pic.twitter.com/e9HYcb26Y2
— ANI (@ANI) December 23, 2019