Toll Plazas: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఇక 60 కిలోమీటర్ల లోపు ఉన్న టోల్‌ గేట్ల మూసివేత: నితిన్‌ గడ్కారీ

| Edited By: Janardhan Veluru

Mar 23, 2022 | 2:59 PM

Toll Plazas: కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ అందించింది. జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల లోపు ఉన్న టోల్‌ ప్లాజాలను రానున్న మూడు నెలల్లో మూసివేస్తున్నట్లు..

Toll Plazas: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఇక 60 కిలోమీటర్ల లోపు ఉన్న టోల్‌ గేట్ల మూసివేత: నితిన్‌ గడ్కారీ
Follow us on

Toll Plazas: కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ అందించింది. జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల లోపు ఉన్న టోల్‌ ప్లాజాలను రానున్న మూడు నెలల్లో మూసివేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ (Nitin Gadkari) లోక్‌సభ (Lok sabha)లో వెల్లడించారు. 2022-23 బడ్జెట్‌లో కేటాయించిన రోడ్లు, రహదారుల కేటాయింపులపై సభలో జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. 60 కిలోమీటర్ల పరిధిలో ఒకే ఒక్క టోల్‌ గెట్‌ ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఢిల్లీ-అమృత్‌ సర్‌-కత్రా ఎక్స్‌ప్రెస్‌ వేను వీలైనంత వేగంగా సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఢిల్లీ-అమృత్‌ సర్‌ రహదారి ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి అవుతుందన్నారు. అలాగే కొన్ని కొత్తగా నిర్మిస్తున్న మార్గాల కారణంగా ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌ చేరుకునేందుకు కేవలం 4 గంటల సమయం మాత్రమే పడుతుందని, కొత్తగా నిర్మిస్తున్న శ్రీనగర్‌ నుంచి ముంబైకి చేరుకునేందుకు 20 గంటల సమయం పడుతుందన్నారు. అలాగే ఢిల్లీ-జైపూర్‌, ఢిల్లీ-డెహ్రాడూన్‌ ఎక్స్‌ప్రెస్‌లు కూడా ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తవుతాయన్నారు. ఢిల్లీ నుంచి ముంబై చేరుకోవాలంటే 12 గంటల సమయం పట్టవచ్చన్నారు. కాగా, 2024 సంవత్సరం నాటికి శ్రీనగర్‌-లేహ్‌ హైవేపై సముద్ర మట్టానికి 11,650 అడుగుల ఎత్తులో ఉన్న జోజిలా పాస్‌ టన్నెల్‌ తెరవాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు.

ఇవి చదవండి:

Ola Electric Vehicles: ఓలా సంచలన నిర్ణయం.. కేవలం 5 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌..!

Drones: విస్తృతంగా డ్రోన్‌ సేవలు.. అందుబాటులోకి వచ్చిన కొత్త సాఫ్ట్‌వేర్‌