Donald Trump 2.O: డొనాల్డ్ ట్రంప్ విజయం.. భారత్‌కు వరమా.. లేక శాపమా?

అమెరికా విదేశాంగ విధానంలో డొనాల్డ్ ట్రంప్ ఆసియా దేశాల్లో భారతదేశానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గత పాలకులు మాత్రం పాకిస్తాన్‌కు ఇతోధికంగా సహకరిస్తూ పరోక్షంగా భారతదేశానికి నష్టం కలిగిస్తూ వచ్చారు. కానీ ట్రంప్ హయాంలోనే భారత్-అమెరికా సంబంధాలు బలోపేతమయ్యాయి.

Donald Trump 2.O: డొనాల్డ్ ట్రంప్ విజయం.. భారత్‌కు వరమా.. లేక శాపమా?
Narendra Modi and Donald Trump (File Photos)

Edited By:

Updated on: Nov 07, 2024 | 1:22 PM

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ సాధించిన విజయం ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. యావత్ ప్రపంచంపై ఆ దేశం ప్రభావం అలాంటిది. 90వ దశకం తర్వాత నుంచి ఆ దేశం భారతదేశంపై చూపే ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రంప్ గతంలోనూ ఒక పర్యాయం అమెరికా అధ్యక్షుడిగా పనిచేయడం, కొన్ని అంశాలపై ఆయన నిక్కచ్చి వైఖరి గురించి భారతదేశానికి, అమెరికాలో స్థిరపడ్డ భారతీయులకు ఇప్పటికే తెలుసు కాబట్టి.. “ట్రంప్ గెలిస్తే భారతదేశానికి లాభం.. అమెరికాలో స్థిరపడ్డ భారతీయులకు మాత్రం నష్టం” అన్న అభిప్రాయం చాలామందిలో నెలకొంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ విజయం భారత్‌కు వరమా లేక శాపమా అన్న విశ్లేషణ చాలా అవసరం. ముందుగా సానుకూలాంశాలను చర్చించుకుందాం. ట్రంప్ విదేశాంగ విధానం అమెరికా విదేశాంగ విధానంలో ట్రంప్ ఆసియా దేశాల్లో భారతదేశానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గత పాలకులు మాత్రం పాకిస్తాన్‌కు ఇతోధికంగా సహకరిస్తూ పరోక్షంగా భారతదేశానికి నష్టం కలిగిస్తూ వచ్చారు. కానీ ట్రంప్ హయాంలోనే భారత్-అమెరికా సంబంధాలు బలోపేతమయ్యాయి. ఆయన హయాంలోనే అమెరికాతో భారత్ అతి పెద్ద రక్షణ ఒప్పందం చేసుకుంది. అంతేకాదు, మూలనపడ్డ క్వాడ్ కూటమి (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్)ని పునరుద్ధరించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారు. భారతదేశానికి సరిహద్దుల్లో సమస్యలు సృష్టించడంతో పాటు భారత మార్కెట్‌పై గుత్తాధిపత్యానికి ప్రయత్నాలు చేస్తున్న చైనా పట్ల ట్రంప్ అనుసరించే వైఖరి మన దేశానికి కలిసొచ్చే...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి