Priyanka Gandhi: యూపీ సీఎం సొంత గడ్డపై గర్జించిన ప్రియాంక గాంధీ.. ‘ప్రాణం పోయినా సరే’

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి సొంత గడ్డ గోరఖ్‌పూర్‌లో గర్జించారు కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రతిజ్ఞా ర్యాలీకి హాజరయ్యారు.

Priyanka Gandhi: యూపీ సీఎం సొంత గడ్డపై గర్జించిన ప్రియాంక గాంధీ.. ప్రాణం పోయినా సరే
Priyanka Gandhi

Updated on: Oct 31, 2021 | 4:19 PM

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి సొంత గడ్డ గోరఖ్‌పూర్‌లో గర్జించారు కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రతిజ్ఞా ర్యాలీకి హాజరయ్యారు ప్రియాంక. బీజేపీ పాలనపై నిప్పులు చెరిగారు. అధిక ధరలతో ప్రజలు అల్లాడిపోతుంటే అటు కేంద్ర , ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రజల కష్టాలను సీఎం యోగి పట్టించుకోవడం లేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రశంసిస్తున్నారని, కాని ఆయన పక్కనే మంత్రి అజయ్‌ మిశ్రా లాంటి క్రిమినల్స్‌ ఉన్నవిషయాన్ని మర్చిపోయారని మండిపడ్డారు. రైతులను తన కాన్వాయ్‌తో తొక్కించిన మంత్రి స్వేచ్చగా తిరుగుతున్నారని ప్రియాంక విమర్శించారు.

యూపీలో ఎస్పీ, బీఎస్పీ లాంటి విపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై పోరాటంలో విఫలమయ్యాయని విమర్శించారు ప్రియాంక. బీజేపీకి తొత్తుగా మారిందని ఆ పార్టీలు విమర్శిస్తున్నాయని, కాని ప్రతి అంశంపై యూపీలో కాంగ్రెస్‌ పార్టీనే పోరాడుతోందని అన్నారు. తన ప్రాణం పోయినా సరే బీజేపీతో కలిసి పనిచేసే ప్రసక్తే ఉండదన్నారు ప్రియాంకాగాంధీ.

Also Read:Central Minister Ajay Mishra: కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి

‘డాడీ.. మమ్మల్ని వదిలి వెళ్లావా’.. కన్నీటి పర్యంతమైన పునీత్ కుమార్తె