Delimitation Row: నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి ఎంత నష్టం..? డీఎంకే ప్లాన్ సక్సెస్ అవుతుందా..

తమిళనాడు రాజకీయం రగిలిపోతోంది. అక్కడి న్యూస్‌ ఛానెల్స్‌ నిండా ఒకటే వార్త. హిందీని రానివ్వం, ఎంపీ సీట్లు తగ్గించడానికి ఒప్పుకోం..! ఇది తప్ప మరో వార్తే లేదిప్పుడు. హిందీ భాషపై రగడ.. నివురుగప్పిన నిప్పులా ఆ సెగ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది తమిళనాడులో. కాని, ఆ నిప్పును మరోసారి రగల్చడంలో సక్సెస్‌ అయ్యారు సీఎం స్టాలిన్. హిందీ భాషకు నియోజకవర్గాల పునర్విభజన అనే అంశాన్ని ముడిపెట్టి ఓ ఉద్యమంగా మారుస్తున్నారు.

Delimitation Row: నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి ఎంత నష్టం..? డీఎంకే ప్లాన్ సక్సెస్ అవుతుందా..
Delimitation Row

Updated on: Mar 05, 2025 | 9:21 PM

తమిళనాడు రాజకీయం రగిలిపోతోంది. అక్కడి న్యూస్‌ ఛానెల్స్‌ నిండా ఒకటే వార్త. హిందీని రానివ్వం, ఎంపీ సీట్లు తగ్గించడానికి ఒప్పుకోం..! ఇది తప్ప మరో వార్తే లేదిప్పుడు. హిందీ భాషపై రగడ.. నివురుగప్పిన నిప్పులా ఆ సెగ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది తమిళనాడులో. కాని, ఆ నిప్పును మరోసారి రగల్చడంలో సక్సెస్‌ అయ్యారు సీఎం స్టాలిన్. హిందీ భాషకు నియోజకవర్గాల పునర్విభజన అనే అంశాన్ని ముడిపెట్టి ఓ ఉద్యమంగా మారుస్తున్నారు. సీఎం స్టాలిన్.. ఓ పక్కా వ్యూహంతో చేస్తున్న రాజకీయ ఎత్తుగడ ఇది. తమిళనాడులో ఎంపీ సీట్లు తగ్గిపోతున్నాయ్, అదే జరిగితే తమిళ అస్తిత్వానికే దెబ్బ అని అరవ సెంటిమెంట్‌ను గట్టిగానే జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ‘ఆలస్యం చేసిన కొద్దీ పరిస్థితి చేయిదాటిపోద్దీ.. మార్చి 5వ తేదీన అందరం కలిసి మాట్లాడుకుందాం రండి..’ అని అక్కడి అఖిలపక్ష పార్టీలను పిలిచారు, ఈ సమావేశాన్ని సైతం విజయవంతంగా ముగించారు. సో, ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయట్లేదు. కలిసొచ్చే ఏ అవకాశాన్నీ చేజార్చుకోవట్లేదు. మరి.. ఆ అఖిలపక్ష సమావేశంలో ఏం తేల్చారు? కొత్తగా పార్టీ పెట్టిన హీరో విజయ్‌ సీఎం స్టాలిన్‌కు ఏ అభిప్రాయం చెప్పారు? నేరుగా ఆల్‌పార్టీ మీటింగ్‌కు వెళ్లిన హీరో కమల్‌హాసన్‌ ఏం చెప్పారు? ఇవన్నీ పక్కన పెడితే.. దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి రావాలని సీఎం స్టాలిన్‌ పిలుపునిచ్చారు. ఏంటి దాని అర్ధం? దక్షిణాది నాయకుడిగా ఎదగాలనే ప్రయత్నం కూడా జరుగుతోందా? ఆ...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి