Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శవం కాలిన బూడిదతో హోలీ సెలబ్రేషన్స్‌… మణికర్ణిక ఘాట్‌లో మొదలైన మసాన్‌ హోలీ

దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు మొదలయ్యాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో హోలీ సెలబ్రేషన్స్ మూడు రోజుల ముందుగానే ప్రారంభమయ్యాయి. మణికర్ణిక ఘాట్‌లో హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. ఢమరుకాలు మోగిస్తూ అక్కడి వారంతా సందడి చేశారు. పెద్ద సంఖ్యలో జనం రావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రజలు హోలీ పండగ సెలబ్రేట్‌ చేసుకోనున్నారు. హోలీ పండగ అంటే.. రకరకాల రంగులు గుర్తుకు వస్తాయి. రంగు రంగుల గులాల్‌

శవం కాలిన బూడిదతో హోలీ సెలబ్రేషన్స్‌... మణికర్ణిక ఘాట్‌లో మొదలైన మసాన్‌ హోలీ
Masan Holi In Varanasi
Follow us
K Sammaiah

| Edited By: TV9 Telugu

Updated on: Mar 13, 2025 | 10:36 AM

దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు మొదలయ్యాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో హోలీ సెలబ్రేషన్స్ మూడు రోజుల ముందుగానే ప్రారంభమయ్యాయి. మణికర్ణిక ఘాట్‌లో హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. ఢమరుకాలు మోగిస్తూ అక్కడి వారంతా సందడి చేశారు. పెద్ద సంఖ్యలో జనం రావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరో మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రజలు హోలీ పండగ సెలబ్రేట్‌ చేసుకోనున్నారు. హోలీ పండగ అంటే.. రకరకాల రంగులు గుర్తుకు వస్తాయి. రంగు రంగుల గులాల్‌ ఒకరిపై ఒకరు చల్లుకుంటూ సందడి చేస్తారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా ఇలాగే ప్రతి ఒక్కరు ఈ పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటారు. అయితే హోలీ పండుగను శ్మశానంలో లభించే చితిభస్మంతో జరుపుకంటారనే విషయం మీలో ఎంత మందికి తెలుసు?యస్‌.. శ్మశానంలో చితిపై కాలిన భౌతిక కాయం తాలుక బూడిదతో హోలీ పండగను జరుపుకుంటారు.

విశ్వేశ్వరుడు కొలువు తీరిన వారణాసి క్షేత్రంలో శ్మశానంలో దొరికే బూడిదతో హోలీ వేడుకలు జరుపుకుంటారు. ఈ హోలీని మసాన్‌‌కి హోలీ, మసాన్ హోలీ అని అక్కడి వారు పిలుచుకుంటారు. వారణాసిలోని హరిశ్చంద్ర ఘాట్‌లో మహా శ్మశాన్ హారతి అనంతరం మసాన్‌కి హోలీ జరుపుకున్నారు. ఈ హోలీ వేళ.. సాధువులు, శివ భక్తులు.. పరమ శివుడిని పూజించిన అనంతరం చితి కాలిన అనంతరం వచ్చిన బూడిదతో హోలీ నిర్వహిస్తారు.

మసాన్‌ హోలీ సమయంలో మణికర్ణికా ఘాట్.. హరిహర్ మహాదేవ్ అనే నామ స్మరణతో మార్మోగింది. . అయితే చితి నుంచి వచ్చిన బూడిదతో హోలీ ఆడటం వల్ల.. శివుడుకి ఆనందం, ఆయన భక్తులకు శ్రేయస్సుతోపాటు ఆశీర్వాదం లభస్తోందనే విశ్వాసం ఉంది. ఈ నేపథ్యంలో మసాన్ హోలీ నిర్వహిస్తారు.

స్కూటర్‌ను ఢీకొట్టి..ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్..నిప్పులు చెరుగుతూ
స్కూటర్‌ను ఢీకొట్టి..ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్..నిప్పులు చెరుగుతూ
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
గాయని గ్లామర్ ట్రీట్..అందాలతో రచ్చచేస్తున్న స్టార్ సింగర్!
గాయని గ్లామర్ ట్రీట్..అందాలతో రచ్చచేస్తున్న స్టార్ సింగర్!
కటింగ్ చేస్తే లక్షలే..! ఓవర్‌ ఆల్ సంపాదన కోట్లలోనే
కటింగ్ చేస్తే లక్షలే..! ఓవర్‌ ఆల్ సంపాదన కోట్లలోనే
మంచి మనసు చాటుకున్న పవన్ కూతురు !! మురిసిపోయిన రేణు !!
మంచి మనసు చాటుకున్న పవన్ కూతురు !! మురిసిపోయిన రేణు !!
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. మెగా అభిమానుల నిర్ణయంపై ప్రశంసలు
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. మెగా అభిమానుల నిర్ణయంపై ప్రశంసలు
పచ్చి ఉల్లి తినే అలవాటు ఉందా ?? ఇది మీకోసమే !!
పచ్చి ఉల్లి తినే అలవాటు ఉందా ?? ఇది మీకోసమే !!
గ్రహాంతరవాసులు ఉన్నారా ?? ఏలియన్స్ జాడ అమెరికాకు తెలుసా ??
గ్రహాంతరవాసులు ఉన్నారా ?? ఏలియన్స్ జాడ అమెరికాకు తెలుసా ??
ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..తీహార్ జైలు తరలిపునకు రూ. 10 కోట్లు
ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..తీహార్ జైలు తరలిపునకు రూ. 10 కోట్లు