Congress vs Bjp: భారత్ స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని దేశ పౌరులంతా తమ డీపీగా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపు ఇప్పుడు, కాంగ్రెస్ బీజేపీల మధ్య రాజకీయ రచ్చకు దారి తీసింది. దానికి కారణం ఆర్ఎస్ఎస్ సోషల్ మీడియా అకౌంట్. అవుతును ప్రధాని పిలుపు మేరకు బీజేపీ శ్రేణులు సహా చాలా మంది పౌరులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ప్రొఫైల్ పిక్స్‌లో త్రివర్ణ పతాకాన్ని పెట్టుకున్నారు. అయితే, ఆర్ఎస్ మాత్రం డీపీని మార్చలేదు. ఇప్పుడేది రచ్చకు దారి తీసింది. దేశ ప్రధాని పిలుపునిచ్చినప్పటికీ.. ఆర్ఎస్ఎస్ ఎందుకు త్రివర్ణ పతాకాన్ని ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. దీనికి కౌంటర్ కూడా ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. తమ ప్రొఫైల్ పిక్‌గా తొలి ప్రధాని నెహ్రూ చేతిలో ఉన్న మువ్వన్నెల జెండాను పెట్టుకున్నారు. రావి నది ఒడ్డున తొలిసారి నెహ్రూ జాతీయ పతకాన్ని తన చేతిలో పట్టుకున్నారని, అందుకే ఆయన ఫోటోను ప్రొపైల్ పిక్‌గా పెట్టుకున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. మోదీ పిలుపుకు కౌంటర్‌గా నెహ్రు పట్టుకున్న జాతీయ జెండాను అందరూ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ , ఆయన సోదరి ప్రియాంక కూడా తమ ప్రొఫైల్ పిక్‌ను మార్చారు. నెహ్రూ పిక్‌నే డీపీగా పెట్టుకున్నారు. అయితే కాంగ్రెస్ తీరుపై బీజేపీ మండిపడింది. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ వేడుకలపై రాజకీయం చేయడం తగదన్నారు. ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 15 వరకు తిరంగా యాత్ర కొనసాగుతుందని, ప్రజలందరూ తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..