బిలియన్ డాలర్ల సారీ..! ఇండియాతో ఎందుకీ తొండాట?

ప్రధాని నరేంద్ర మోదీ వీడియో తొలగింపు వ్యవహారం కేంద్ర ప్రభుత్వం, మెటా మధ్య పెద్ద వివాదంగా మారింది. సాంకేతిక లోపమని మెటా వివరణ ఇచ్చినా ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. క్షమాపణతో పాటు అల్గారిథమ్ పారదర్శకత, డీప్‌ఫేక్‌లు, అక్రమ కంటెంట్ నియంత్రణపై స్పష్టమైన కార్యాచరణ కోరుతూ కేంద్రం కఠిన వైఖరి అవలంబిస్తోంది.

బిలియన్ డాలర్ల సారీ..! ఇండియాతో ఎందుకీ తొండాట?
Meta Apology

Updated on: Aug 05, 2026 | 9:55 PM

సమయం లేదు మిత్రమా.. సారీ చెబుతావా లేదా? తప్పయిపోయింది క్షమించండి అని లెంపలేసుకుంటావా లేదా? మూడురోజుల్లోనే తేల్చుకో..! ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హుకుం ఇది. కానీ, వాళ్లడిగింది ఆషామాషీ సారీ కాదు. లక్షల కోట్ల డాలర్ల విలువైన సారీ. ఐనా చెప్పేశారు సారీ. కానీ, తల దించుకుని ఒక్క క్షమాపణ చెబితేనే తెగేలా లేదు ఈ పంచాయతీ. సోషల్ మీడియా గుత్తాధిపత్యానికి చెక్ పడే సందర్భం వచ్చినట్టే ఉంది. మెటా వర్సెస్ మోదీ… అసలెక్కడ మొదలైందీ సెగ..? జూలై 23.. జెన్‌జీ జాతరతో జంతర్‌మంతరే కాడు ఢిల్లీ మొత్తం అగ్నిగుండంలా మండుతున్నప్పుడు, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఊస్టింగ్‌కి దగ్గరపడ్డప్పుడు, యావత్ ప్రభుత్వం నిప్పులకొలిమిలా రగులుతున్నప్పుడు.. కూల్‌కూల్‌గా మై డియర్ ఫ్రెండ్స్ అంటూ అర్థరాత్రిపూట కాక్రోచ్‌లకు మోదీ ఇచ్చిన సానుకూల సందేశం.. వరల్డ్‌వైడ్ సెన్సేషన్. ఆ ఒక్క వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఐతే 24 గంటల్లోనే 30 కోట్లకు పైగా వ్యూస్‌తో రికార్డుల్ని కొల్లగొట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. కానీ, ఆ మరుసటిరోజే మోదీ అఫీషియల్ ఫేస్‌బుక్ ఖాతా నుంచి గాయబ్ ఐంది. ఎలా? ఏం జరిగుంటుంది కుట్ర..? సోకాల్డ్ కాక్రోచ్‌లను, జెన్‌జీ మూమెంట్‌ను ఫిదా చేస్తామని, పేపర్‌ లీక్‌లపై కఠిన చర్యలు...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి