VK Pandian: ఒడిశా పాలిటిక్స్‌లో సూపర్ సీఎం.. ఐఏఎస్ అధికారికి బంపర్ ఆఫర్.. అసలు ఏం జరిగిందంటే..?
రాజకీయాల్లో అవకాశాలు అంత ఈజీగా రావు.. అలాగే ఒక్కోసారి అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయి. ప్రస్తుతం ఒడిశా రాజకీయాలలో అలాంటి పరిణామమే జరిగింది. నిన్నటిదాకా రాజ్యాంగేతర శక్తిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఆ ఐఏఎస్ అధికారి ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా మారారు.. ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ సీఎంగా పిలిచే స్థాయికి చేరుకున్నారు..
రాజకీయాల్లో అవకాశాలు అంత ఈజీగా రావు.. అలాగే ఒక్కోసారి అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయి. ప్రస్తుతం ఒడిశా రాజకీయాలలో అలాంటి పరిణామమే జరిగింది. నిన్నటిదాకా రాజ్యాంగేతర శక్తిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఆ ఐఏఎస్ అధికారి ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా మారారు.. ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ సీఎంగా పిలిచే స్థాయికి చేరుకున్నారు.. తమిళనాడులో ఇపుడు ఆ ఐఎఎస్ పెరు హ్యాష్ ట్యాగ్ గా మారింది. తమిళనాడుకు చెందిన వి.కార్తికేయ పాండ్యన్ 200 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఒడిశా క్యాడర్‌కు ఎంపికైన కార్తికేయ పాండ్యన్ అనేక కీలక బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఒడిశా ప్రభుత్వం ఆయన్ను కీలక స్థానంలో కూర్చోబెట్టింది.
ట్రాన్స్ఫర్మేషనల్ ఇన్సియేటివ్స్(Transformational Initiatives) పదవి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే క్యాబినెట్ హోదా కూడా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2000 నుంచి ఐ.ఏ.ఎస్ అధికారిగా అనేక బాధ్యతలు చేపట్టిన పాండ్యన్ ఇటీవల ఒడిశా రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. 2011 నుంచి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న కార్తికేయ పాండ్యన్.. అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల ముందు బిజేడి అభ్యర్థుల ఎంపికలో పాండ్యన్ కీలకంగా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత ప్రభుత్వంలో ప్రతి కీలక నిర్ణయం వెనుక కార్తీకేయ పాండ్యన్ ఆలోచన ఉండేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ప్రతిపక్షాలైతే నిత్యం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కంటే కార్తికేయ పాండ్యన్ నే ఎక్కువగా టార్గెట్ చేసేవి. ఐఏఎస్ అధికారి రాజ్యాంగేతర శక్తిగా మారారని అన్నింట్లో తల దూర్చేవారని ఆరోపణలు చేసేవి కూడా.. ఇక అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా కార్తికేయ పాండ్యన్ తీరు నచ్చేది కాదు. సీఎంను కలవాలన్నా ముందుగా కార్తికేయ పాండ్యన్ ని కలవాల్సిందే.. ఇక పాండ్యన్ ని కలవడం కూడా అంతగా కుదిరేది కాదని అసంతృప్తిగా ఉండే పరిస్థితి. ఇక త్వరలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కార్తికేయ పాండ్యన్ ఇలాంటి విమర్శల నుంచి విముక్తి కోసం తాను దూరమవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..
ఇదే విషయంపై నవీన్ పట్నాయక్ ఉన్నట్టుండి కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే విఆర్ఎస్ తీసుకోవాలని కోరారు. రాజీనామా చేసిన వెంటనే ఆమోదం రావడం.. ఆ వెంటనే కీలక పదవి కట్టబెట్టడం అంతా గంటల్లో జరిగిపోయాయి. ఈ నిర్ణయం అటు ప్రతిపక్షాలకు, ఇటు బి.జే.డి పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. ఇవన్నీ అలా ఉంచితే ఇన్నాళ్లు అధికారి హోదాలో కీలకంగా వ్యవహరించిన కార్తికేయ పాండ్యన్ ఇక అధికారికంగా పొలిటికల్ రోల్ పోషించనున్నారు. సీఎం తర్వాత అన్నీ తానై సూపర్ సీఎంగా పని చేసేందుకు లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. ఇక ఇప్పుడు ఇదే విషయం బీహార్ తర్వాత తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు వాసి సత్తా ఇదే అంటూ కార్తికేయ పాండ్యన్ ను హ్యాష్ ట్యాగ్ చేస్తూ పొగడ్తలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..