ఇంతకీ “కపిల్ మిశ్రా” ఎవరో తెలుసా..?
“గోలీ మారో సాలోంకో..” ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా కపిల్ మిశ్రా పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఏఏ వ్యతిరేకులను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు కపిల్ మిశ్రా. ఈ ఒక్క వివాదాస్పద వ్యాఖ్యతో బీజేపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా.. ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో కూడా ఈయనే పేరే మళ్లీ వినిపిస్తోంది. ఇంతకీ ఈ కపిల్ మిశ్రా ఎవరూ..? అన్న సందేహాలు అందరి […]

“గోలీ మారో సాలోంకో..” ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా కపిల్ మిశ్రా పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఏఏ వ్యతిరేకులను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు కపిల్ మిశ్రా. ఈ ఒక్క వివాదాస్పద వ్యాఖ్యతో బీజేపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు.
తాజాగా.. ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో కూడా ఈయనే పేరే మళ్లీ వినిపిస్తోంది. ఇంతకీ ఈ కపిల్ మిశ్రా ఎవరూ..? అన్న సందేహాలు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. అయితే ఈ వివాదాస్పద నేత ఈశాన్య ఢిల్లీలోని కరవల్ నగర్‌కు చెందిన వారు. కపిల్ మిశ్రా సోషల్ వర్క్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన తల్లి అన్నపూర్ణ మిశ్రా.. బీజేపీ నాయకురాలు.. మాజీ మేయర్ కూడా. అయితే, అన్నాహజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్‌మిశ్రా.. అన్నాహజారే కార్యక్రమానికి ఆకర్షితుడయ్యారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. 2015లో కరవల్ నగర్ నుంచి పోటీ చేసి.. ఎమ్మెల్యే గా గెలిచారు. ఆ తర్వాత మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు.
2017లో పార్టీ అధినేత.. సీఎం కేజ్రీవాల్‌పైనే అవినీతి ఆరోపణలు చేశారు. అయితే మిశ్రా చేసిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ, లోకాయుక్త.. కేజ్రీకి క్లీన్‌చిట్ ఇచ్చింది. దీంతో పార్టీ నుంచి కపిల్ మిశ్రాను తొలగించారు. దీంతో ఆప్ నుంచి బీజేపీ వైపు అడుగులు వేశారు. “మై పీఎం.. మై ప్రైడ్” పేరుతో.. సోషల్ మీడియాలో మోదీకి మద్దతుగా ప్రచారం ప్రారంభించారు. ఆ తర్వాత గతేడాది ఆగస్టులో కాషాయ కండువా కప్పకున్నారు.