Samosas: సీఎం సమోసా మిస్సింగ్.. సీఐడీ ఎంక్వైరీకి ఆదేశించిన ప్రభుత్వం
సీఎం కోసం తెచ్చిన సమోసాలను ఎవరు తిన్నారు? 5 స్టార్ హోటల్ నుంచి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు కోసం ఆర్డర్ చేసిన సమోసాలు ఆయన వద్దకు ఎందుకు చేరలేదు. ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించారు? .. ఈ ప్రశ్నలనే హిమాచల్ ప్రదేశ్ సీఐడీ దర్యాప్తు చేస్తోంది.
సీఎం సుక్కుకి సమోసాలు ఎందుకు అందలేదన్న విషయంలో సీఐడీ బాస్ ఆదేశాలు జారీచేశారు. దీనిపై ఓ సీనియర్ అధికారి ఎంక్వైరీ చేపట్టడంతో ఆసక్తికర విషయాలు తెలిశాయి. అక్టోబర్ 21 వ తేదీన సీఎం సుఖ్వింద్ సింగ్ సుక్కు సీఐడీ సైబర్ వింగ్ స్టేషన్ క్వార్టర్స్ ప్రారంభించడానికి వెళ్లారు. సీఎం కోసం సమోసాలు కేకులు తెప్పించాలని ఓ ఐజీ ర్యాంక్ అధికారి ఎస్సైకి చెప్పారు. ఆయన ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌తో కలిసి షిమ్లాలోని లక్కర్ బజార్‌లో ఉన్న రాడిసన్ బ్లూ హోటల్‌కు వెళ్లారు. మూడు బాక్సుల్లో సమోసాలు, కేకులు తీసుకొచ్చారు. ఆ బాక్సులను MT విభాగానికి పంపించారు. అక్కడి నుంచి సీఎం దగ్గరకు సమోసాలు వెళ్లాల్సి ఉంది.
కానీ.. ఈ సమోసాలు ఎవరికి ఇవ్వాలనేదారిపై MT విభాగంలో ఎవరికీ క్లారిటీ లేదు. వివరంగా చెప్పాల్సిన ఎస్సై చెప్పలేదు. దీంతో ఆ సమోసాలు అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందికి వడ్డించేశారు. మీటింగ్‌లో ఉన్న సీఎంతోపాటు.. సీఐడీ బాస్, ఇతర ఉన్నతాధికారులు ఆకలితోనే వెనుదిరిగారు. దీంతో సీఎంకు మర్యాదలు చేయలేకపోయామన్న అవమానం సీఐడీ బాస్‌ను వెంటాడింది. ఎంక్వైరీ వేయడంతో సమన్వయ లోపమే దీనికి కారణమని తేలింది. దీనిపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రజాసమస్యలు గాలికొదిలి ఈ సమోసా గోల ఏంటని ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..