మగాళ్లు.. ‘నో షేవ్ నవంబర్’ గురించి తెలుసా ??

Phani CH

08 November 2024

నేటి యువత నవంబర్ నెల రాగానే గడ్డం గీసుకోవడం మానేస్తారు.. అయితే ఇలా ఎందుకు చేస్తారు దీనికి గల కారణాలు ఏంటో  మీకు తెలుసా ?? 

నవంబర్ నెల డ్డం గీసుకోకపోవడాన్ని కొందరు ‘నో షేవ్ నవంబర్’ అని కూడా అంటారు. ఈ నెలలో గడ్డం, జుట్టును కత్తిరించుకోరని మీకు తెలుసా.. దీనికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ నో షేవ్ నవంబర్ ఎందుకు వచ్చింది అనే విషయం చాలామందికి తెలియదు.. కొంతమంది కేవలం ఫ్యాషన్ కోసమే అనుకుంటారు.. దీని వెనక ఒక కథ ఉంది.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

‘నో షేవ్ నవంబర్’ అనేది క్యాన్సర్, ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి ఒక ప్రచారం.

ఈ సమయంలో, ప్రజలు ఒక నెల వరకు గడ్డం లేదా జుట్టును కత్తిరించరు. దీని ఉద్దేశ్యం జుట్టు పెరగడమే కాదు, క్యాన్సర్‌పై పోరాటంలో సంఘీభావం చూపడం కూడా అని అర్థం.

జుట్టు కత్తిరించకపోవడానికి క్యాన్సర్ రోగులకు సంభందం ఏంటి అనుకుంటున్నారా .. దీనికి ముఖ్య ఉద్దేశం  జుట్టు కత్తిరించడానికి అయ్యే ఖర్చు క్యాన్సర్ రోగుల చికిత్స కోసం విరాళంగా ఇవ్వడం.

2009లో, మాథ్యూ హిల్ ఫౌండేషన్ అనే అమెరికన్ ప్రభుత్వేతర సంస్థ “నో షేవ్ నవంబర్” ప్రచారాన్ని ప్రారంభించింది.