Anitha Radhakrishnan:తమిళనాడులో మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. కోతకు గురైన సముద్ర తీర ప్రాంతాన్ని చూసి పరిశీలించడానికి తిరువల్లూరు జిల్లాలో మంత్రి అనితా రాధాకృష్ణన్ వెళ్లారు. అయితే అక్కడ నీటిలో నడవడానికి మంత్రి కాస్త చిరాకు పడ్డారు. ఒక వేళ నీటిలో నడిస్తే తన ఖరీదైన షూ పాడవుతాయని భావించారు. దీనిని గమనించిన మత్స్యకారులు వెంటనే షూ నీటిలో తడవకుండా మంత్రిని ఎత్తుకుని భుజాలపై వెళ్లారు. ఈ వీడియో స్థానిక ఓ న్యూస్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. కాలికి బురద అంటకుండా పడవలో ప్రయాణించిన మంత్రి రాధాకృష్ణన్ అనంతరం కూడా దానిలోంచి దిగడానికి వెనకంజ వేశారు.
నీళ్లు ఉన్న చోటే పడవను నిలుపడంతో అందులో దిగేందుకు వెనకాడారు మంత్రి. దీంతో షూలు పాడవుతాయనే ఉద్దేశంతో మత్స్యకారులు భుజాలపై మోసుకెళ్లాల్సి వచ్చింది. ఈ వీడియోను చూసిన ప్రజలు మండిపడిపోతున్నారు. కనీసం నీళ్లలో కూడా నడిచేందుకు ఇష్టపడని మంత్రి ప్రజల కష్టాలు ఎలా తీర్చుస్తాడు అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ వీడినయో వైరల్‌గా మారింది. మంత్రి వెంట పాటు ఎమ్మెల్యే, కలెక్టర్ తదితర అధికారులు కూడా ఉన్నారు. మంత్రిని ఇలా మోసుకెళ్లడంపై మంత్రి మత్స్యకారులకు క్షమాపణలు చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి రాధాకృష్ణన్ తన బూట్లకు ఇచ్చినంత విలువ ప్రజలకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మంత్రి ఉంటే ప్రజలకు ఏం సేవ చేస్తారని ఎద్దేవా చేస్తున్నారు.